అదేంటి.. రంగస్థలాన్ని అడ్డుకునే అవసరం ఏముంది.. రామ్ చరణ్ ఎవరికీ ఏ శత్రువు కాదు కదా అనుకుంటున్నారా..? ఏమో ఎప్పుడు ఎవరికి ఎవరిపై ఎందుకు కోపం వస్తుందో ఎప్పుడూ ఊహించలేం. ఇక ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే మార్చ్ 30న భారీ స్థాయిలో రంగస్థలం విడుదల కానుంది. ఇప్పటికే అన్నిచోట్లా రిలీజ్ హంగామా కనిపిస్తుంది. అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు. తమ హీరో ఈ సారి కచ్చితంగా బాక్సాఫీస్ బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు వాళ్లు. అయితే అన్నీ బాగానే ఉన్నాయి కానీ ప్రీమియర్స్ విషయం దగ్గరే ఎక్కడో తేడా వస్తుంది. ఇప్పటికే ఆంధ్రాలో ప్రీమియర్స్ వేసుకోవాలంటూ అనుమతి వచ్చేసింది. అయితే ఇప్పుడు అక్కడ కూడా కాస్త కన్ఫ్యూజన్ నడుస్తుంది. పడేవరకు కూడా ప్రీమియర్స్ ఉన్నాయా లేవా అనే విషయంపై క్లారిటీ లేదు. ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి. హైదరాబాద్ లోని శివపార్వతి, విశ్వనాథ్ థియేటర్స్ లో ప్రీమియర్ షోలు వేయాలని నిర్ణయించారు ఫ్యాన్స్ సంఘాలు. కానీ ఈ షోలకు ఇప్పటి వరకు అనుమతి అయితే రాలేదు. మరోవైపు టికెట్స్ కూడా ముద్రించేసి బయట ఇచ్చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. కానీ పోలీసుల పర్మిషన్ మాత్రం రాలేదు. ఈ విషయంపైనే రామ్ చరణ్ తన స్నేహితుడు కేటీఆర్ ను రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తుంది. అన్నీ కుదిర్తే మార్చ్ 29 రాత్రే రంగస్థలం థియేటర్స్ దర్శనమివ్వడం ఖాయం. కానీ కుదరకపోతే మాత్రం కచ్చితంగా మరో 12 గంటలు ఓపిక పట్టాల్సిందే. చూడాలిక.. చివరివరకు రంగస్థలం ప్రీమియర్ కథ ఎక్కడ ముగియనున్నాయో..?