రజినీకాంత్ పాలిటిక్స్ లోకి వస్తాను అని అనౌన్స్మెంట్ చేయగానే ఫాన్స్ సంతోషానికి హద్దులు లేవు. ‘రజినిమంద్రం.ఓఆర్‌జీ’ పేరుతో తలైవా ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఇక అంతే రెండు రోజుల్లో మూడు లక్షలమందికిపైగా అభిమానులు వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకుని పార్టీ సభ్యత్వం పొందారు. పది లక్షలమందికిపైగా ఈ సైట్‌ను విజిట్ చేశారు.. ‘అసంఖ్యాకమైన అభిమాన సంఘాలు, ఫ్యాన్ క్లబ్‌లు, తమిళ ప్రజలను ఏకం చేయడానికి ఈ వెబ్‌సైట్ ప్రారంభిస్తున్నాను. ఇందులో మీ పేర్లు నమోదుచేసుకుని పార్టీ సభ్యుడిగా చేరవచ్చు.’ అని రజనీ వీడియో సందేశం ఇచ్చారు. రజనీ ఇలా ఒక్క వీడియో పోస్ట్ చేశారోలేదో అభిమాన సందోహంతో వెబ్‌సైట్ నిండిపోయింది. పార్టీ పేరు చెప్పక ముందే ఇంత రెస్పాన్స్ వస్తే పేరు అనౌన్స్ చేసాక ఇంకెలా వస్తుందో చూడాలి మరి. సంక్రాంతి రోజున తన పార్టీ పేరును రజనీ లాంఛనంగా ప్రారంభిస్తారని ప్రచారం జరుగుతోంది.
తమిళనాడులో రజనీకాంత్ మేనియా ఓ రేంజ్‌లో ఉంది. ‘రాజకీయాల్లోకి వస్తున్నాను’ అంటూ ఆయన ప్రకటన చేసిన క్షణం నుంచి అభిమానులు ఆనందంతో ఊగిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 50వేలకుపైగా ఉన్న అభిమాన సంఘాలను ఏకం చేయడంతోబాటు.. తన పార్టీలోకి అందరినీ ఆహ్వానిస్తూ.. ‘రజినిమంద్రం.ఓఆర్‌జీ’ పేరుతో తలైవా ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఇక అంతే రెండు రోజుల్లో మూడు లక్షలమందికిపైగా అభిమానులు వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకుని పార్టీ సభ్యత్వం పొందారు. పది లక్షలమందికిపైగా ఈ సైట్‌ను విజిట్ చేశారు