ఇండస్ట్రీలో ఓ సెంటిమెంట్ ఉంది.. రాజమౌళితో సినిమా చేయడం చేసేటప్పుడు హాయిగానే ఉంటుంది.. కానీ ఆ తర్వాతే అసలు చుక్కలు కనిపిస్తాయి అని..! నిజమే.. అలా చాలా మందికి కనిపించాయి కూడా. రాజమౌళి సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుంటారు కానీ తర్వాత మాత్రం అదే టెంపో కొనసాగించలేక చేతులెత్తేస్తుంటారు. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ హీరో కూడా రాజమౌళి సినిమా తర్వాత నెక్ట్స్ సినిమాతో హిట్ కొట్టలేదు. కానీ గతేడాది ఆ సెంటిమెంట్ బ్రేక్ చేసాడు రానా. నేనేరాజు నేనేమంత్రితో సోలో హీరోగా విజయం అందుకున్నాడు దగ్గుపాటి వారసుడు. బాహుబలి 2లో ఈయన విలన్ గా నటించాడు. ఆ సినిమా తర్వాతే నేనేరాజు నేనేమంత్రి వచ్చింది. ఇక ఇప్పుడు అనుష్క కూడా రాజమౌళి సెంటిమెంట్ కు బ్రేక్ చెప్పింది. ఈమె నటించిన భాగమతి మంచి వసూళ్లు సాధిస్తుంది. చూస్తుంటే కచ్చితంగా హిట్ అయ్యేలాగే కనిపిస్తుంది. మరో 4 కోట్లు వస్తే సేఫ్ జోన్ కి వచ్చినట్లే. ఈ లెక్కన భాగమతి కూడా హిట్టే. అంటే జేజమ్మ కూడా రాజమౌళి సెంటిమెంట్ ను దాటేసి వచ్చి విజయం అందుకుందన్నమాట. ప్రస్తుతం ఈమె భాగమతి సక్సెస్ నే ఎంజాయ్ చేస్తుంది.. మరో సినిమా చేయడానికి కూడా చాలా టైమ్ తీసుకునేలా కనిపిస్తుంది ఈ బ్యూటీ. మొత్తానికి దర్శక ధీరుడి సెంటిమెంట్ ను కూడా పక్కనబెట్టి హిట్లు కొట్టి చూపించారు రానా.. అనుష్క.