ఏఆర్ రెహమాన్.. ఈ పేరు వింటేనే తెలియకుండా మనలో ఓ ఊపు వస్తుంది.. పెదవులపై పాట వస్తుంది.. నోటిలోంచి రాగం వస్తుంది. ఈ పేరుకు ఉన్న ప్రత్యేకత అలాంటిది మరి. 22 ఏళ్ల ప్రాయంలోనే సంగీత దర్శకుడిగా మారి ఇప్పటి వరకు ఎన్నో రికార్డులు అందుకున్నాడు ఈయన.
ప్రపంచ వ్యాప్తంగా రెహమాన్ అంటే తెలియని సంగీత ప్రియుడు ఉండడు. ఇప్పటికే ఈయన ఖాతాలో చేరని అవార్డు అంటూ లేదు. గ్రామీతో పాటు ఆస్కార్ లు.. ఫిల్మ్ పేర్ అవార్డులు వచ్చాయి. ఇప్పుడు నేషనల్ అవార్డ్ మరోటి వచ్చేసింది. రోజాతో తొలిసారి నేషనల్ అవార్డు అందుకున్న రెహమాన్.. ఆ తర్వాత మెరుపు కలలు.. అమృత..
లగాన్ సినిమాలకు కూడా అవార్డులు అందుకున్నాడు. ఇప్పుడు మరోసారి నేషనల్ అవార్డ్ తీసుకున్నాడు రెహమాన్. ఇదే ఏడాది మరో నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నాడు ఈ సంగీత సామ్రాట్. మామ్ సినిమాకు అద్భుతమైన ఆర్ఆర్ అందించిన రెహమాన్ కు జాతీయ అవార్డ్ వచ్చింది. మొత్తానికి రెండు నేషనల్ అవార్డులతో డబుల్ డోస్ ఇచ్చాడు ఏఆర్ రెహమాన్.