పవన్ కళ్యాణ్ పోరాట యాత్రకు జనం బ్రహ్మరథం పడుతూ వెళ్లిన ప్రతి చోట జన సేన అధినేతకు నీరాజనాలు పలుకుతుండడం చూసి ఓర్వలేక అధికార తెదేపా, ప్రధాన ప్రతిపక్షమైన వై.సి.పి బురద జల్లే కార్యక్రమమే పనిగా పెట్టుకున్నారు. పవన్ మాత్రం ఇవేమి పట్టించుకోకుండా యాత్ర కొనసాగిస్తూ తనదైన శైలిలో ఈ రెండు పార్టీలను విమర్శల బాణాలతో ఇరకాటంలో పెడుతున్నారు.
తే.దే.పా నేతలు పవన్ ఎక్కు పెడుతున్న ప్రశ్నలకు ఎలా స్పందించాలో తెలియక తికమక పడుతూ అనవసరమైన విషయాలను బూతద్దంలో చూపే ప్రయత్నం చేస్తున్నారు మార్గ మధ్యలో ఒకటి లేదా రెండు రోజులు విరామం తీసుకున్నందుకు కొన్ని తే.దే.పా, వై.సి.పి లకు వంత పాడే కొన్ని వెబ్ సైట్ లలో పవన్ ది పోరాట యాత్ర లేక విరామ యాత్ర అని డబ్బులిచ్చి మరి సెటైర్ లు వేయిస్తున్నారు, పార్టీ కార్యకర్తలను అభిమానులను నిరాశపరిచి ప్రయత్నం చేస్తున్నారు. పవన్ తన వ్యక్తిగత జీవితంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోడానికే విరామం తీసుకున్నారని కొన్ని వెబ్ సితులలో ప్రచారం చేస్తున్నారు. ఇటీవలే అయన మాజీ భార్య రేణు దేశాయ్ రెండో పెళ్ళికి సిద్దమవుతున్నట్లు సూచిస్తూ సామజిక మద్యం లో ఓ పోస్ట్ షేర్ చేసారు. అదే జరిగితే పవన్ తన పిల్లలైనా అకిరా, ఆద్యల భవిష్యత్తు పై ఆందోళన చెందుతున్నారని. ఇదే విషయమై రేణు తో గొడవపడుతున్నారని రాసుకొచ్చారు. అయితే వీటిలో ఏ మాత్రం వాస్తవం లేదని, పవన్ విరామం తీసుకోవడానికి కారణం వై ఎస్ జగన్ గోదావరి జిల్లాలలో పర్యటించడం వలనే అంటున్నారు. జగన్ యాత్ర ను పర్యవేక్షించి. జగన్ దృష్టి సారించని సమస్యలను లేవనెత్తే నెపంతో పవన్ పోరాట యాత్రను వాయిదా వేసుకున్నారని జన సేన వర్గాలు అంటున్నాయి.
మరో వైపు, జన సేన తల-తోక లేని పార్టీ అని తల-తోక లేని ప్రసంగాలు చేసే బాలకృష్ణ విమర్శించడం మరీ విడ్డూరం అంటున్నారు. జన సేన కు క్యాడర్ లేదని, లీడర్ లు కరువయ్యారని, వన్ మ్యాన్ షో లా పవన్ పార్టీని నడిపిస్తున్నారని తెదేపా నేతలు ఎద్దేవా చేస్తున్నారు. 175 నియోజకవర్గాలలో పోటీ చేస్తామంటున్న పవన్ తమ అభ్యర్థులని ఎందుకు ప్రకటించలేకున్నారని ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం.. ఆనాడు ప్రజా రాజ్యం పార్టీ అభ్యర్థులని ముందే ప్రకటించగా వారిని అప్పటి అధికార పార్టీ అయిన కాంగ్రెస్ తమ కుయ్యూక్తులతో వారిని అవినీతిపరులని, క్రిమినల్స్ గాను చిత్రీకరించి ప్రజలను తప్పు ద్రోవ పట్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తెదేపా పదవులు వెలగబెడుతున్న కేశినేని నాని, పరకాల ప్రభాకర్ వంటి వారు ప్ర.రా.పా లో కోవర్టులుగా చేరి పార్టీ పతనానికి నీచ రాజకీయాలు ఎలా చేసారో కూడా చూశాము.
అందుకే పవన్ జన సేన విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇతర పార్టీలనుండి వచ్చే జంప్ జిలానీలను కాకుండా ప్రజల సమస్యలు తెలిసిన లోకల్ లీడర్లను అభ్యర్థులుగా ఎన్నుకున్నారు. జన సేన క్యాడర్ గ్ర్యాస్ రూట్ లెవెల్లో పక్కాగా సిద్ధంగా ఉంది, 175 నియోజక వర్గాల్లో నిలబడబోయే అభ్యర్థుల జాబితా కూడా రెడీగా ఉంది అని తెలుస్తోంది. ఈ కార్యక్రమాలన్నీ అంతా రహస్యంగా జన సేన శతాగ్ని టీమ్ చూసుకుంటోంది. అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు తలపెట్టాలని చూసిన అధికమించి పవన్ తన పోరాట యాత్రను అద్భుతంగా కొనసాగించకలగడం కూడా ఇందుకు నిదర్శన.
పవన్ కళ్యాణ్