అవును… రజినీ సినిమాకు ఇప్పుడు విజయ్ తండ్రి అడ్డుపడ్డాడు. అది కూడా హీరో విజయ్ తండ్రే. ఈ మధ్యే నటన వైపు కూడా వచ్చిన ఈయన.. ఇప్పుడు ఏకంగా రజినీకాంత్ చేయాలనుకున్న సినిమాను తాను చేస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా ఓ సినిమా ట్రాఫిక్ రామ స్వామి అనే సినిమా రావాల్సి ఉంది. ఇది అతడి బయోపిక్ కూడా. తమిళనాడుతో పాటు ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ట్రాఫిక్ ఇబ్బందుల్ని క్లియర్ చేయ డానికి రామస్వామి చాలా కష్టపడ్డాడు.
కొత్తకొత్త పద్దతులు కనిపెట్టాడు. ఈయన గురించి ఎన్నో ఆర్టికల్స్ కూడా వచ్చాయి. అవార్డులు కూడా అందుకున్నాడు. ఈయన జీవితంపై ఓ సినిమా చేయాలని శంకర్ భావించాడు. అందులో ఆ పాత్ర కోసం రజినీ అయితే పర్ ఫెక్ట్ గా ఉంటాడని అను కున్నాడు.. రజినీకి కూడా చెప్పేసాడు. అంతా ఓకే అనుకుంటున్న టైమ్ లో హీరో విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ కూడా ఈ చిత్రం చేయబోతున్నట్లు అనౌన్స్ చేసాడు.
ట్రాఫిక్ రామస్వామి పాత్రలో తానే నటించబోతున్నట్లు చెప్పాడు. దాంతో శంకర్ తన నిర్ణయాన్ని మార్చుకుని.. ప్రాజెక్ట్ ఆపుకున్నాడు. ఆ పాత్రకు చంద్రశేఖర్ పక్కాగా సూట్ అవుతాడని భావిస్తున్నాడు శంకర్. అయితే ఈ సినిమా సంగతి పక్కనబెడితే ఇప్పటి వరకు 2.0 గురించి మాత్రం అప్ డేట్ ఇవ్వడం లేదు శంకర్. అసలు ఈ చిత్రం వస్తుందా రాదా.. వస్తే ఎప్పుడొస్తుంది అనేది మాత్రం చెప్పడం లేదు ఈ దర్శకుడు.