ల‌వ‌ర్.. అంతా క‌లిసి ఆడుకుంటున్నారుగా..!

ఎలా వ‌చ్చిన హీరో.. ఎలా అయిపోయాడు..? ఇండ‌స్ట్రీలో సొంతంగా ఎద‌గ‌డం అంటే మాట‌లు కాదు. కోట్ల‌లో ఏ ఒక్క‌డో చిరంజీవి అవుతాడు.. ఏ ఒక్క‌డో ర‌వితేజ అవుతాడు.. ఏ ఒక్క‌డో నాని అవుతాడు. అంతేకానీ అంతా కాలేరు క‌దా..! ఇప్పుడు రాజ్ త‌రుణ్ ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది పాపం. వ‌ర‌స విజ‌యాల‌తో ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన రాజ్.. ఇప్పుడు వ‌ర‌స ఫ్లాపుల‌తో ఉనికి కోసం పాటు ప‌డుతున్నాడు. క‌నీసం కోటి రూపాయ‌ల షేర్ కూడా తీసుకురాలేని దారుణ‌మైన స్టేజ్ కు దిగ‌జారిపోయాడు రాజ్ త‌రుణ్.

ఇలాంటి టైమ్ లో ఈయ‌న చేతిలో ఉన్న ఆయుధం పేరు ల‌వ‌ర్. దిల్ రాజు నిర్మాత కావ‌డంతో ఈ చిత్రంతో క‌చ్చితంగా త‌ను ఫామ్ లోకి వ‌స్తాన‌ని న‌మ్ముతున్నాడు రాజ్ త‌రుణ్. అలాఎలా ఫేమ్ అనీష్ కృష్ణ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్ర ఆడియో విడుద‌ల అయింది. అయితే అంతా బాగానే ఉన్నా ఇప్పుడు ఈ చిత్ర విడుద‌ల‌కు వీలు చిక్క‌డం లేదు. జులై 12న విడుద‌ల చేద్దామ‌ని దిల్ రాజు భావించినా.. అదే రోజు మెగాఅల్లుడు క‌ళ్యాణ్ దేవ్ విజేత వ‌స్తుంది. అత‌డికి సోలో రిలీజ్ కోసం దిల్ రాజును కాస్త వెన‌క్కి వెళ్లాల‌ని అడిగిన‌ట్లు తెలుస్తుంది.

దాంతో జులై 20న ల‌వ‌ర్ విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తున్నాడు దిల్ రాజు. అయితే అదే రోజు సాక్ష్యం విడుద‌ల కానుంది. మ‌రి ఆ సినిమా పోస్ట్ పోన్ అవుతుందా లేదా అనేది మాత్రం ఇప్పుడు క్లారిటీ లేదు. ఈ చిత్రంలో రాజ్ త‌రుణ్ అయితే పోనీ టైల్ తో కొత్త‌గా ఉన్నాడు రాజ్. ప్యూర్ ల‌వ్ స్టోరీగా వ‌స్తున్న ల‌వ‌ర్.. రాజ్ త‌రుణ్ ఆశ‌ల్ని ఎంత‌వ‌ర‌కు నిల‌బెడుతుందో తెలియ‌దు. ఈ చిత్రంలో రిద్ది కుమార్ హీరోయిన్ గా న‌టిస్తుంది. మ‌రి దిల్ రాజు వ‌ర‌స విజ‌యాల‌లో రాజ్ త‌రుణ్ కూడా భాగ‌మైపోతాడో లేదంటే త‌న ప‌రాజ‌యాల్లోకి రాజుగారినే రాజ్ త‌రుణ్ తీసుకొస్తాడో చూడాలిక‌..!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here