అవునా.. రవితేజ లవర్ ఎవరు అనుకుంటున్నారా..? అంతే కదండీ.. ఓ సినిమాలో నటిస్తే ఆ హీరోకు హీరోయిన్ లవర్ అవుతుంది కదా..! ఆ లెక్క ప్రకారం ఇప్పుడు రవితేజ లవర్ మాళవిక శర్మ. ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న సినిమాలో అమ్మడే హీరోయిన్. చూడ్డానికి అమాయకంగా కనిపించినా.. లోపల మాత్రం చాలా ముదురు ఈ ముద్దుగుమ్మ. అందాలతోనే చంపేస్తుంది మాళవిక శర్మ. తాజాగా ఈ భామ ఫోటో షూట్ ఒకటి విడుదలైంది. ఇందులో అందాలన్ని విచ్చలవిడిగా ఆరబోసింది. ఇది చూసి వామ్మో.. పాప చాలా హాట్ కదా అనుకుంటున్నారు. ఇప్ప టికే చాలా యాడ్స్ లో నటించింది మాళవిక శర్మ. టీవీల్లో సూపర్ పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సినిమాల్లోకి వచ్చేస్తుంది. రవితేజ లాంటి స్టార్ హీరో సినిమాతోనే ఇండస్ట్రీకి వస్తుంది మాళవిక. అమ్మడు అందాల ఆరబోత చూస్తుంటే త్వరలోనే తెలుగులో పక్కా సెటిలైపోయేలా కళలైతే కచ్చితంగా కనిపిస్తున్నాయి. మరి చూడాలిక.. కళ్యాణ్ కృష్ణ సినిమా విడుదలైన తర్వాత తెలుస్తుంది మాళవిక స్టామినా ఏంటో..?