విక్ట‌రీ మూవీస్ వారి `గ్లామ‌ర్ గ‌ర్ల్స్` ప్రారంభం


విక్ట‌రీ మూవీస్ ప‌తాకంపై గుల్ మ‌హ్మ‌ద్, అక్బ‌ర్, స‌లీమ్, జి. శంక‌ర్ గౌడ్ తెలుగు, హీందీ భాష‌ల్లో నిర్మిస్తోన్న `గ్లామ‌ర్ గ‌ర్ల్స్‌` చిత్రం గురువారం హైద‌రాబాద్ ఫిలి ఛాంబ‌ర్ లో ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి నిర్మాత చద‌ల‌వాడ శ్రీనివాస‌రావు క్లాప్ ఇచ్చారు. కెమెరా స్విచ్ఛాన్, గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం ఎన్. శంక‌ర్ వ‌హించారు. గెహనా వ‌శీష్ట‌, షీలా క‌పూర్, అర్చా శ్రీవాస్త‌వ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తోన్న ఈ చిత్రానికి హృద‌య్ శంక‌ర్ మిశ్రా ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు.
ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ, ` యజ్ఞం, వ‌ర్షం, పౌర్ణ‌మి, ల‌క్ష్మి న‌ర‌సింహా చిత్రాల‌కు ప‌నిచేశాను. 12 భాష‌ల్లో ద‌ర్శ‌క‌త్వం వ‌హించాను. తొలిసారి తెలుగు సినిమా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం ఆనందంగా ఉంది. నాకు తెలుగు సినిమా అండ‌గా ఉంటుంద‌ని ఆశిస్తున్నా. ఈ సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే `ప్ర‌తీ యువ‌తి అందంగా ఉన్నాన‌ని క‌ల‌లు కంటుంది. త‌నకు అంద‌మైన ముఖం ఉంద‌ని అనుకుంటుంది. ఇది ఒక అమ్మాయి క‌థ కాదు. అంద‌మైన క‌ల‌లు క‌నే ప్ర‌తీ అమ్మాయి క‌థే ఈ సినిమా`. సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది. నా మిత్రుడు శంక‌ర్ గౌడ్ స‌హ‌కారంతోనే సినిమా చేస్తున్నాను` అన్నారు.
చిత్ర నిర్మాత శంక‌ర్ గౌడ్ మాట్లాడుతూ,`న‌ల‌భై సంవ‌త్స‌రాల నుంచి ప‌రిశ్ర‌మ‌లో ఉన్నాను. వివిధ శాఖ‌ల్లో ప‌నిచేశాను. తొలిసారి ఓ మంచి సినిమాతో నిర్మాత‌గా ప‌రిచ‌యం అవుతున్నాను. చ‌క్క‌ని క‌థ‌, క‌థ‌నాల‌తో తెర‌కెక్కుతున్న చిత్ర‌మిది. అంద‌రూ నాకు స‌హ‌క‌రించాల‌ని కోరుకుంటున్నా` అని అన్నారు.
మ‌రో నిర్మాత గుల్ మ‌హ్మ‌ద్ మాట్లాడుతూ, ` మంచి విలువ‌లున్న ద‌ర్శ‌కుడు దొరికారు. ప‌లు భాష‌ల్లో ఆయ‌న చేసిన చిత్రాల‌కు మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు వ‌చ్చాయి. ఈ సినిమా కూడా అద్భుతంగా తీస్తార‌ని భావిస్తున్నాను. మంచి టీమ్ దొరికింది. అలాగే అంద‌ర్నీ మెప్పించ క‌థ కూడా ఇది. చ‌క్క‌ని మాట‌లు కుదిరాయి. ఈ సినిమా నిర్మిస్తున్నందుకు గ‌ర్వంగా ఉంది`అని అన్నారు.
ఎన్. శంక‌ర్ మాట్లాడుతూ, ` శంక‌ర్ గౌడ్ ఎప్ప‌టి నుంచో ప‌రిచ‌యం. చాలా కాలం నుంచి ఇండ‌స్ర్టీలో ఉన్నారు. ఈ గ్లామ‌ర్ గాళ్స్ ఆయ‌న కెరీర్ ను ట‌ర్న్ చేస్తుంద‌ని అనుకుంటున్నా` అన్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ‌, జ్ఞానేష్ శ్రీవాస్త‌వ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here