ఈ మధ్య కొందరు హీరోయిన్లు తొలి సినిమా విడుదలవ్వక ముందు నుంచే తెగ హడావిడి చేస్తున్నారు. వాళ్ల చూపులతో మాటలతో మాయ చేసి పడేస్తున్నారు. సాయిపల్లవి ఆ లిస్ట్ లోకే వస్తుంది. ఇప్పుడు రష్మిక మందన్న కూడా. కన్నడలో గతేడాది వచ్చిన కిరిక్ పార్టీ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది రష్మిక. ఈ చిత్రం అక్కడ సంచలన విజయం సాధించింది. ఈ చిత్ర షూటింగ్ నడుస్తున్న సమయంలోనే హీరో కమ్ డైరెక్టర్ రక్షిత్ శెట్టి తో ప్రేమలో పడిపోయింది. త్వరలోనే ఈయన్ని పెళ్లి కూడా చేసుకోబోతుంది రష్మిక.
ఇదిలా ఉండగానే తెలుగులో కెరీర్ కూడా బాగానే ప్లాన్ చేసుకుంటుంది. ఇప్పటికే ఇక్కడ నాగశౌర్యతో నటించిన ఛలో విజయం సాధించింది. ఈ చిత్రంలో అమ్మడి యాక్టింగ్ కు కుర్రాళ్ళంతా ఫిదా అయ్యారు. ముఖ్యంగా రష్మిక ఇచ్చిన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తెగ నచ్చేస్తున్నాయి ప్రేక్షకులకు. ఛలో సెట్స్ పై ఉన్నపుడే విజయ్ దేవరకొండతో ఓ సినిమాలో నటించడానికి ఓకే చెప్పింది రష్మిక. దీనికి గీత గోవిందం అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారు. ఈ చిత్ర షూటింగ్ లో భాగంగానే విజయ్ కు వార్నింగ్ ఇచ్చింది రష్మిక. ఓవరాక్షన్ తగ్గించుకో..
అసలు ఆ ఫిల్మ్ ఫేర్ నీకు కాకుండా తారక్ లేదంటే ప్రభాస్ కు ఇచ్చుంటే బాగుండేది అని ట్వీట్ చేసింది రష్మిక. దీనికి మీ లాంటి వాళ్లు మాట్లాడటం.. గడపడమే గొప్ప అవార్డ్.. వాటి ముందు ఈ అవార్డులేం పనిచేస్తాయంటూ విజయ్ కూడా సెటైర్ వేసాడు. ప్రస్తుతం నానితో కూడా శ్రీరామ్ ఆదిత్య సినిమాలో నటిస్తుంది రష్మిక. దాంతోపాటు మరో రెండు సినిమాల్లోనూ రష్మికను తీసుకోవాలని అనుకుంటున్నారు. వరస సినిమాలతో తెలుగులోకి చాలా సైలెంట్ గా వచ్చేసింది ఈ కిర్రాక్ హీరోయిన్. మరి టాలీవుడ్ లో ఈ భామ మాయ ఎంతవరకు కొనసాగుతుందో చూడాలిక..!