సరిపోయింది పో.. ఇప్పుడు తమిళ రాజకీయాలు చాలా వేడెక్కుతున్నాయి. అక్కడ ఇప్పటికే ఇద్దరు స్టార్ హీరోలు రాజకీయాల్లోకి వచ్చేసారు. రజినీతో పాటు కమల్ కూడా ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉన్నారు. వచ్చే ఏడాది రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ కూడా చేయనున్నారు. ఇలాంటి టైమ్ లో విజయ్ కూడా రాజకీయ అరంగేట్రం గురించి ఆలోచిస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈయన కూడా పాలిటిక్స్ లోకి వస్తున్నాడని.. అసలు రజినీ, కమల్ కంటే ముందే విజయ్ రాజకీయాల్లోకి రావాలనుకున్నాడని అతడి తండ్రి చంద్రశేఖర్ తెలిపారు. కానీ రజినీ, కమల్ వచ్చిన తర్వాత ఎందుకో మళ్లీ విజయ్ వెనక్కి తగ్గాడు. పైగా విజయ్ కూడా చాలా రోజులు ఓపిక పట్టి ఓపెన్ అయ్యాడు. తనను కావాలనే రెచ్చగొడుతున్నారని.. ఈ పొలిటికల్ లీడర్స్ ఓవర్ యాక్షన్స్ చూసి తనకు మనసులో లేకపోయినా..
కావాలంటే రాజకీయాల్లోకి వచ్చేలా చేస్తున్నారని చెబుతున్నాడు ఈ హీరో. నిజంగా అభిమానులు కోరుకుంటే తాను రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమంటూ సన్నిహితులతో విజయ్ అంటున్నాడని తెలుస్తోంది. అయితే అది ఆవేశంలో చెప్పిన మాటే కానీ.. తనకు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చే ఉద్ధేశం లేదని చెప్పాడు ఇళయ దళపతి.
ఇక ఇప్పుడు రజినీ, కమల్ మధ్య వెళ్లి అనవసరంగా చిచ్చు పెట్టడం కూడా తనకు ఇష్టం లేదని విజయ్ సన్నిహితులతో చెబుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికి తమిళనాట నడుస్తున్నది ద్విముఖ పోటీనే.. తాను వచ్చి త్రిముఖ పోటీ చేయదలుచుకోలేదని చెప్పాడు విజయ్. అంటే మొత్తానికి విజయ్ ను ఇప్పట్లో రాజకీయాల్లో చూడనట్లే ఇక..!