తానూ ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిన సామెత గుర్తుకు వస్తుంది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాని చూస్తుంటే. 300 కోట్లరూపాయలతో డిజిటల్ ప్రాజెక్టు చేపట్టగా అది నీటి మీద రాతల మారింది. నగరంలోని ట్యాంక్ బండ్ తోపాటు నెక్లెస్ రోడ్లపై ఉచితంగా వైఫై సేవలు అందించేలా వైఫై హాట్ స్పాట్ లను జీహెచ్ఎంసీ అధికారులు ఆర్భాటంగా ప్రారంభించారు. వైఫై కేబుల్స్ వేసేందుకు జీహెచ్ఎంసీ అనుమతించక పోవడంతోపాటు వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయం వచ్చేలా జీహెచ్ఎంసీ చేయకపోవడంతో వైఫై సేవలు నిలిచిపోయాయి. అనుకున్నది ఒక్కటి అయింది ఒక్కటి ల ఉంది తెలంగాణ ప్రభుత్వం.