దర్శకుడు రాజమౌళికి సినిమాకు సంబంధించి ఏదైనా నచ్చిందంటే అది రాజముద్రే. ఆయన బావుందంటే చాలు.. ఖచ్చితంగా అందులో మంచి విషయం ఉన్నట్టే. ద బెస్ట్ అనిపిస్తేనే పొగిడే రాజమౌళికి.. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన వైఫ్ ఆఫ్ రామ్ ట్రైలర్ విపరీతంగా నచ్చింది. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. అన్ని వర్గాల నుంచి విపరీతమైన ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా రాజమౌళిని సైతం మెప్పించిందీ ట్రైలర్. వైఫ్ ఆఫ్ రామ్ ట్రైలర్ పై ప్రశంసల జల్లు కురిపించారాయన. ట్రైలర్ చూస్తుంటేనే ఇది న్యూ ఏజ్ థ్రిల్లర్ లా ఉందని పొగిడేశారు. టేకింగ్ ఇంటిలిజెంట్ గా ఉందని, ఇలాంటి కొత్త తరహా కథ ఎంచుకున్న దర్శకుడు విజయ్ యెలకంటికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. తనను బాగా ఆకట్టుకున్న ఈ సినిమా టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ పెట్టాడు రాజమౌళి..
వైఫ్ ఆఫ్ రామ్ ఓ సైకలాజికల్ థ్రిల్లర్. ఈ తరహా కథలు మన దగ్గర ఇంత వరకూ రాలేదు. ఇంటెన్సివ్ గా సాగే కథనం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా చిత్ర టీమ్ ముందు నుంచీ చెబుతోంది. మొత్తంగా రాజమౌళిని మెప్పించిన వైఫ్ ఆఫ్ రామ్ ఆడియన్స్ నూ ఆకట్టుకోవడానికి త్వరలోనే విడుదల కాబోతోంది.
వైఫ్ ఆఫ్ రామ్ గా మంచు లక్ష్మి నటించిన ఈ చిత్రంలో ఇంకా సమ్రాట్ రెడ్డి, ప్రియదర్శి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు నటిస్తున్నారు.
Intriguing trailer… All the best to @VijayYelakanti. Nice that you chose a new age thriller for your debut. Wishing #WifeofRam team all Success. https://t.co/2aevDI9VuN
— rajamouli ss (@ssrajamouli) June 11, 2018
సాంకేతిక నిపుణులు : విజువల్ ఎఫెక్ట్స్ : ఉదయ్ కిరణ్. పి, కాస్ట్యూమ్స్ : అజబ్అలీ అక్బర్, ఎడిటర్ : తమ్మిరాజు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : సామల భార్గవ్, సంగీతం : రఘు దీక్షిత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వంశీ కృష్ణనాయుడు, మాటలు : సందీప్ రెడ్డి గంటా, ప్రొడక్షన్ డిజైనర్ : దీప్, సహ నిర్మాత : వివేక్ కూచిభొట్ల, నిర్మాణం : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్స్, నిర్మాతలు : టి.జి. విశ్వప్రసాద్, లక్ష్మి మంచు, రచన, దర్శకత్వం : విజయ్ యెలకంటి.