భరత్ అనే నేను బహిరంగ సభకు ఎల్బీ స్టేడియం మొస్తాబైంది. భారీ సినిమా సెట్టింగ్ ను తలపించే సెట్స్ తో స్టేడియం అంతా అదిరిపోయింది. ముఖ్యంగా మనం చూస్తున్నది నిజంగానే ఆడియో ఫంక్షనా లేదంటే ఏదైనా సినిమా షూటింగా అనిపించేలా భారీగా ఈ సెట్టింగ్ ఏర్పాటు చేసారు. ఇప్పటి వరకు బాహుబలి మినహా మరే సినిమాకు ఇంత భారీ సెట్టింగ్ వేయలేదు.
ఇప్పుడు భరత్ అనే నేను కోసం దానయ్య చేయించాడు. కొరటాల శివ కూడా ఈ వేడుకను టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ ఫంక్షన్ లా ఉండాలని ప్లాన్ చేస్తున్నాడు ముందు నుంచి. ఇప్పుడు ఇదే జరిగింది కూడా. ఎన్టీఆర్ ఈ వేడుకకు ఛీఫ్ గెస్ట్ గా వస్తున్నాడు. దానికోసం నందమూరి అభిమానులు కూడా భరత్ అనే నేను వేడుకకు బారులు తీరుతున్నారు.
దానికితోడు భరత్ అనే నేనులో ముఖ్యమంత్రిగా నటిస్తున్నాడు మహేశ్. ఆయన నటిస్తున్న తొలి పొలిటికల్ మూవీ ఇది. దాంతో అభిమానుల్లో ఎక్కడ లేని అంచనాలున్నాయి. అవన్నీ కాకుండా శ్రీమంతుడు కాంబినేషన్ కావడం దీనికి మరో బోనస్. ఇలా ఎటు చూసుకున్నా కూడా భరత్ అనే నేను టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీగా మారిపోయింది.
ఈ వేడుకతోనే సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్లిపోవాలని చూస్తున్నాడు కొరటాల శివ. సినిమా ఎప్రిల్ 20న విడుదల కానుంది. రిలీజ్ మూడు రోజుల ముందు విజయవాడలో ప్రీ రిలీజ్ వేడుక ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఆ వేడుకుక రామ్ చరణ్ ఛీఫ్ గెస్ట్ గా రానున్నాడు.