ధనుష్ దున్నేస్తున్నాడు.. ఒక్కో సినిమాతో తన ఇమేజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పటి వరకు తమిళ్ సినిమాలతోనే గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో.. ఇప్పుడు ఇతర ఇండస్ట్రీల్లోనూ సత్తా చూపిస్తున్నాడు. అయితే చాలా రోజుల తర్వాత ఈయన నుంచి పక్కా తమిళ సినిమా వచ్చింది. వడాచెన్నై అంటూ పేరులోనే చెన్నైను నింపుకుని వచ్చిన ఈ చిత్ర టీజర్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది.
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెట్రిమారన్ దీన్ని తెరకెక్కిస్తున్నాడు. గతంలో ఈ కాంబినేషన్ లో వచ్చిన ఆడుకాలంలో నటనకు ధనుష్ కు నేషనల్ అవార్డ్ వచ్చింది.
ఇక ఇప్పుడు విడుదలైన వడాచెన్నై టీజర్ కూడా అదిరిపోయింది. ముఖ్యంగా టీజర్ లో అరవ పద్దతులను బాగానే చూపించాడు దర్శకుడు. నాటి చెన్నై ఎలా ఉండేదో మొత్తం ఈ టీజర్ లో ప్రజెంట్ చేసాడు.
80ల్లో సాగే ఈ కథను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు వెట్రి. అమలాపాల్, ఐశ్వర్యారాజేష్ హీరోయిన్లు. ఐశ్వర్యాతో లిప్ లాక్ సీన్స్ కూడా చేసాడు ధనుష్. పక్కా మాస్ గెటప్ లో పిచ్చెక్కిస్తున్నాడు ఈ హీరో. ఈ మధ్య సరైన విజయం లేదు ధనుష్ కు. దాంతో ఇప్పుడు వడాచెన్నైతో దున్నేయాలని చూస్తున్నాడు.