వ‌రుణ్.. సుమంత్.. అలా సెట్ట‌య్యార‌న్న‌మాట‌..!


ఇండ‌స్ట్రీలో హిట్టు ఫ్లాపు కామ‌న్. హిట్ వ‌చ్చిన‌పుడు అవ‌కాశాలు కూడా వ‌స్తాయి. కానీ ఫ్లాప్ వ‌స్తే మాత్రం మ‌రిచిపోక త‌ప్ప‌దు. అలాంటి టైమ్లో ఖాళీగా ఉండి ఏం చేయాలి..? ఒక‌ప్పుడు కుర్ర హీరోల‌కు ఛాన్సుల్లేక‌పోతే క‌నుమ‌రుగైపోయేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. వాళ్ల‌కు బోలెడు ఆప్ష‌న్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ త‌రం హీరోలంతా షార్ట్ ఫిల్మ్స్.. వెబ్ సిరీస్ అంటూ కొత్త దారుల్ని వెతుక్కుంటున్నారు. ఒక‌ప్పుడు సినిమాలు ఫ్లాప్ అయితే అయ్యో ఏం చేయాల్రా దేవుడా అని కుర్ర హీరోలు త‌ల‌లు ప‌ట్టుకునే వాళ్లు. పాపం కొంద‌రైతే కెరీర్ ఇచ్చిన షాక్ నుంచి కోలుకోలేక లోకాన్ని వ‌దిలేసారు. కానీ ఇప్పుడు ప‌రిస్థితులు మారిపోయాయి. ఇండ‌స్ట్రీ ఇప్పుడు ఎన్నో అవ‌కాశాల‌కు ఓపెన్ గేట్ గా మారిపోయింది. సినిమాలు.. అవి కాక‌పోతే సీరియ‌ల్స్.. అవి కాక‌పోతే షార్ట్ ఫిల్మ్స్.. అవి కూడా కాక‌పోతే వెబ్ సిరీస్. ఇప్పుడు మ‌న కుర్ర హీరోలు కూడా ఇదే చేస్తున్నారు.
సుమంత్ అశ్విన్ నే తీసుకోండి. స్మార్ట్ లుకింగ్ తో ప‌డేసే ఈ కుర్రాడు కెరీర్ ను మ‌లుపుతిప్పే స‌రైన స‌క్సెస్ కోసం వేచి చూస్తున్నాడు. అంత‌కుముందు ఆ త‌ర్వాత‌, ల‌వ‌ర్స్, కేరింత లాంటి సినిమాల‌తో సుమంత్ ఇప్ప‌టికే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే స్టార్ గా మాత్రం మార‌లేదు. దాంతో కెరీర్ యు ట్యూబ్ వైపు ట‌ర్న్ తీసుకున్నాడు ఈ కుర్ర హీరో. రెండేళ్లుగా ఈ హీరో కెరీర్ మ‌రీ దారుణంగా త‌యారైంది. క‌నీసం సుమంత్ సినిమా వ‌చ్చిన‌ట్లు కూడా ప్రేక్ష‌కుల‌కు తెలియ‌ట్లేదు. ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోతున్నాయి అత‌డి సినిమాలు. ఫ్యాష‌న్ డిజైన‌ర్ తో స‌హా. దాంతో మ‌నోడు ఎంచ‌క్కా సినిమాలు వ‌దిలేసి వెబ్ సిరీస్ పై ప‌డ్డాడు. ఎందుకిలా అంటూ ఓ వెబ్ సిరీస్ చేసాడు సుమంత్ అశ్విన్. దేవాక‌ట్టా ఈ సిరీస్ కు ద‌ర్శ‌కుడు.
ఇక ఇప్పుడు ఇదే దారిలో వ‌రుణ్ సందేశ్ కూడా వెళ్తున్నాడు. హ్యాపీడేస్ తో ప‌రిచ‌య‌మై.. కొత్త బంగారు లోకంతో మ‌రో హిట్ కొట్టిన వ‌రుణ్ సందేశ్ ఆ త‌ర్వాత వ‌ర‌స‌గా 15 ఫ్లాపులు ఇచ్చాడు. ఒక్క‌టంటే ఒక్క హిట్ అందుకోలేక చ‌తికిల‌ప‌డ్డాడు. పైగా రెండేళ్లుగా సినిమా అవ‌కాశాల్లేక ఖాళీగా ఉన్నాడు ఈ కుర్ర హీరో. దాంతో హే కృష్ణ అనే వెబ్ సిరీస్ లో హీరోగా న‌టిస్తున్నాడు వ‌రుణ్ సందేశ్. ఈ మ‌ధ్యే ఇది యూ ట్యూబ్ లో విడుద‌లైంది. తొలి ఎపిసోడ్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. మొత్తానికి వెబ్ సిరీస్ లు వ‌చ్చిన త‌ర్వాత సినిమాలు లేక‌పోయినా ప్రేక్ష‌కుల‌కు మాత్రం దూరం కావ‌ట్లేదు ఈ కుర్ర హీరోలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here