దేన్నైనా తెగేవరకు లాగడం మంచిది కాదేమో..? ఇప్పుడు వర్మ ఇదే చేస్తున్నాడు. ఈయన చేస్తున్నాడో లేదంటే టివి 9 చేస్తుందో తెలియదు కానీ ఈ ఇద్దరి మధ్య వివాదం మాత్రం ఇప్పుడు ముదురుతుంది. నిన్నటి వరకు దోస్త్ మేరా దోస్త్ అంటూ భుజాలపై చేయి వేసుకుని తిరిగి.. పిలిచినపుడు కాఫీ తాగి స్టూడియోలో కూర్చున్నవాళ్లే ఇప్పుడు నువ్వు మోసగాడు అంటే కాదు నువ్వు మోసగాడు అంటూ తిట్టుకుంటున్నారు. అసలు ఇలా తిట్టుకుంటూ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడో ఏమో తెలియదు కానీ వర్మ మాత్రం ఇప్పుడు టివి 9పై చాలా సీరియస్ గా ఉన్నాడు. తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ నిజాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని టివి 9పై మండి పడ్డాడు వర్మ. అంతేకాదు.. ఆ ఛానెల్ అన్నీ తప్పుడు వార్తలే ప్రచారం చేస్తుందని.. రజినీకాంత్ అండర్ లో అది పని చేస్తుందని విమర్శించాడు.
తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేసినందుకు గానూ తన లాయర్స్ క్రిమినల్ కేస్ వేయడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించాడు వర్మ. అసలు ఈ ఇష్యూ అంతా జిఎస్టీ నుంచి మొదలైంది. ఆయనతో ఆ మధ్య ఓ రోజంతా చర్చలో కూర్చోబెట్టింది టివి 9. ఆ వేదికపైనే మహిళా మండలి అధ్యక్షురాలు దేవిపై అనుచిత వ్యాఖ్యలు చేసాడు వర్మ. దాన్నే ఇప్పుడు ఛానెల్ పెద్దది చేస్తుంది. ఈ విషయంపై కేస్ వేయడంతో పోలీసుల ముందుకు కూడా వచ్చాడు వర్మ. ఇప్పటికే ఈయన ఫోన్ తో పాటు ల్యాప్ ట్యాప్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే మళ్లీ పోలీసుల ముందుకు విచారణకు రానున్నాడు ఈ దర్శకుడు. ఇదిలా ఉంటే ఇప్పుడు దోస్తీగా ఉన్న ఛానెల్ పై వర్మ గుర్రుమనడం ఇప్పుడు సంచలనం అవుతుంది. మరి చూడాలిక.. చివరికి ఈ రచ్చ ఎక్కడ తెగనుందో..?