లై.. చల్ మోహన్ రంగా లాంటి వరస ఫ్లాపుల తర్వాత నితిన్ నటిస్తున్న సినిమా శ్రీనివాస కళ్యాణం. ఇక దిల్ రాజు కూడా ఈ మధ్యే లవర్ తో ఓ షాక్ తిన్నాడు. ఇప్పుడు ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమా శ్రీనివాస కళ్యాణం. నితిన్ హీరోగా నటించిన దిల్ సినిమాతోనే రాజుగారి ప్రయాణం మొదలైంది. అందుకే దిల్ రాజు అయ్యారు.
ఆ తర్వాత ఇన్నేళ్లకు మళ్లీ ఇప్పుడు శ్రీనివాస కళ్యాణంతో నితిన్ ను కలుపుకున్నాడు రాజు. ఇప్పుడు ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ఇది చూస్తుంటేనే కన్నుల పండగలా అనిపిస్తుంది. స్క్రీన్ పై నితిన్, రాశీఖన్నా జంట చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉందో..? 30 సెకన్ల టీజర్ లోనే ఈ ఇద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది.
ఇక రేపు సినిమాలో ఎలా ఉండబోతుందో ఊహించుకుంటేనే ఆహా అనిపిస్తుంది. సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. ఆగస్ట్ 9న విడుదల కానుంది ఈ చిత్రం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉంది శ్రీనివాస కళ్యాణం. ఈ చిత్రంతో తాను కెరీర్ లోనే పెద్ద హిట్ కొడతానంటున్నాడు నితిన్. మరి ఈయన నమ్మకం ఎంతవరకు నిలబడుతుందో చూడాలిక..!