అదేంటి.. శ్రీరెడ్డికి పెదరాయుడుకు సంబంధం ఏంటి అనుకుంటున్నారా..? ఒక్కసారి పెదరాయుడు సినిమా గుర్తు చేసుకోండి..! అందులో తీర్పును కాస్త గమనించండి. ఎవర్నైనా ఊళ్లోంచి వెలేస్తే వాళ్ళకి ఎవరూ సాయం చేయకూడదు.. మాట్లాడకూడదు.. అలా చేస్తే వాళ్లకు కూడా ఇదే శిక్షంటూ పాపారాయుడు తీర్పు ఇస్తాడు కదా..! అచ్చంగా ఇప్పుడు శ్రీరెడ్డిపై కూడా మా అసోషియేషన్ ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. ఇన్నాళ్లూ ఈమెను తమ గుండెల్లో పెట్టుకుని చూసుకున్నామని.. కానీ ఆమె మాత్రం నడిరోడ్డుపై బట్టలిప్పేసి ఇండస్ట్రీ పరువుతో పాటు ఫిల్మ్ చాంబర్ పరువును కూడా తీసేసిందని మా ప్రెసిడెంట్ శివాజీరాజా ఫైర్ అయ్యారు. ఇన్నాళ్లూ ఎంత రచ్చ చేసినా శ్రీరెడ్డి గురించి పెద్దగా పట్టించుకోని మా అసోసియేషన్.. ఇష్యూ ఇప్పుడు సీరియస్ గా తీసుకున్నారు.
ఈమె కోసమే ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి మరీ ఆమెకు ఇకపై అవకాశాలు రావని.. ఎవరూ ఇవ్వరని తేల్చి చెప్పేసారు. బజార్ లో నిలబడి బట్టలిప్పితే అవకాశాలు రావని.. ఇప్పటి వరకు ఆమెకు ఇచ్చిన అవకాశాలను కూడా వెనక్కి తీసుకోవాలని దర్శక నిర్మాతలకు చెప్పారు. దానికితోడు ఆమెకు జీవితంలో మా అసోసియేషన్ కార్డ్ రాదని తేల్చేసారు శివాజీరాజా. తామే కాదు.. ప్రెసిడెంట్లు మారినా కూడా శ్రీరెడ్డికి కార్డ్ ఇవ్వం అని కూడా చెప్పారు. దానికి ఆమె ప్రవర్తనే కారణం అని తేల్చేసారు మా ప్రెసిడెంట్. ఆఫర్లు వచ్చినపుడు చక్కగా నటించక.. ఇలా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు వాళ్లు.
నిజంగా ఆ అమ్మాయికి సినిమాపై ప్రేమ ఉంటే ఇలా చేయదు అని.. తేజ సినిమాలో ఆఫర్ వచ్చింది ఏమో ఆ సినిమాతో క్లిక్ అయ్యేదేమో.. ఆమెకు కావాల్సింది ఆఫర్లు కాదు ఫ్రీ పబ్లిసిటీ అంటూ మండి పడ్డారు. ఇప్పుడే కాదు.. జీవితంలో ఎప్పుడూ శ్రీరెడ్డికి మా అసోషియేషన్ మెంబర్ షిప్ ఇవ్వమని చెప్పేసారు. అంతేకాదు.. ఆమెకు అవకాశాలు రావని.. ఇచ్చిన వాళ్లకు కూడా ఇదే పరిస్థితి పడు తుందని పెదరాయుడు తీర్పు ఇచ్చేసారు. శ్రీరెడ్డితో నటించినా కూడా వాళ్లను మా నుంచి సస్పెండ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు ప్రెసిడెంట్ శివాజీ రాజ. దాంతో ఇప్పుడు శ్రీరెడ్డి ఇంకెంతగా రెచ్చిపోతుందనేది ఆసక్తికరంగా మారింది. పైగా ఈమెకు తేజతో పాటు మరో దర్శకుడు కూడా ఆఫర్ ఇచ్చాడు. వర్మ కూడా అవకాశం ఇస్తానంటున్నాడు. మరి ఈ దర్శకుల పరిస్థితి ఏంటి ఇప్పుడు..? వాళ్లను కూడా మా నుంచి బహిష్కరిస్తారా అనేది చూడాలిక..!