సాక్ష్యం సినిమా మూడు రోజుల వసూళ్లు బాగానే ఉన్నాయి. నాగచైతన్య, శర్వానంద్ లాంటి కుర్ర హీరోల కంటే ఎక్కువ వసూళ్లు తీసుకొస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. సాక్ష్యం కూడా మూడు రోజుల్లో 8.3 కోట్ల షేర్ తీసుకొచ్చింది. మన ఇండస్ట్రీలో చాలా మంది కుర్ర హీరోలకు ఈ స్థాయి వసూళ్లు అయితే రావు. కానీ ఇప్పుడు ఇంత తీసుకొచ్చిన సాక్ష్యం ముందు లక్ష్యం మాత్రం భారీగానే ఉంది. ఈ చిత్రం సేఫ్ అవ్వాలంటే 25 కోట్లు రావాలి. టాక్ కూడా తేడాగా ఉండటంతో ఈ చిత్రం సేఫ్ అవ్వడం కష్టంగానే ఉందిప్పుడు.
బెల్లంకొండ తన మాస్ ఇమేజ్ తో బి, సి సెంటర్స్ లో సినిమాను నిలబెట్టొచ్చు అనే ఊహలు ముందున్నా ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే చాలా కష్టంగా మారిపోయింది. కనీసం ఇదివరకు సినిమాలు పాజిటివ్ టాక్ తో ఓపెన్ అయి కాస్ట్ ఫెయిల్యూర్స్ గా నిలిచాయి. స్పీడున్నోడు మాత్రమే డిజాస్టర్ ఈ కుర్రాడి కెరీర్ లో. అయితే ఇప్పుడు సాక్ష్యం రెండోదిగా మారబోతుంది. పరిస్థితులు చూస్తుంటే ఈ చిత్రం అటూ ఇటూగా బయ్యర్లకు 8 కోట్ల వరకు నష్టాలు మిగిల్చేలా కనిపిస్తుంది. మరి చూడాలిక.. చివరి వరకు సాక్ష్యం తన లక్ష్యాన్ని ఎంత వరకు సాధిస్తుందో..?