అవును.. ఇప్పుడు ఇదే జరుగుతుంది. సాక్ష్యం సినిమా అన్నిచోట్లా విడుదల కావడం లేదు. అక్కడక్కడా సాంకేతిక కారణాలతో ఆగిపోయింది. ఇప్పటికే మల్టీప్లెక్స్ లలో ఉదయం షోలు అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. కంటెంట్ లోడింగ్ ఆలస్యం కావడంతో సాక్ష్యంకు ఈ తిప్పలు తప్పడం లేదు. ఓవర్సీస్ ప్రీమియర్స్ కూడా ఇదే కారణంతోనే ఆగిపోయాయి. నిర్మాతలకు దీనివల్ల భారీ నష్టమే వస్తుంది.
ఇక ఇదే సమస్య ఇప్పుడు ఇండియాలోనూ వస్తుంది. ఇది కానీ ఇంకా ఆలస్యం అయితే అసలుకే ఎసరొచ్చే ప్రమాదం లేకపోలేదు. అందుకే ప్రస్తుతం వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని తలలు బద్ధలు కొట్టుకుంటున్నారు దర్శక నిర్మాతలు. హైదరాబాద్ లో 10 గంటల నుంచి షోలు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే కొన్ని ఊళ్లలో మాత్రం మధ్యాహ్నం నుంచి షోస్ పడనున్నాయి.
మార్నింగ్ షోల వరకు గ్యారెంటీ అయితే లేదు. భారీ అంచనాలతోనే సాక్ష్యం సినిమా వస్తుంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకుడు. ఇద్దరికీ ఇప్పుడు విజయం తప్పనిసరి. మరి చూడాలిక.. అక్కడక్కడా సమస్యలతో వస్తోన్న సాక్ష్యం బాక్సాఫీస్ దగ్గర గెలుపుకు సాక్ష్యంగా నిలుస్తుందో లేదో..?