రాజమౌళి సాయం లేడు.. చిరంజీవి సినిమాలో లేడు.. ఫామ్ లో ఉన్న దర్శకుడు కాడు.. రామ్ చరణ్ కు ముందు బ్లాక్ బస్టర్ లేదు.. అయినా గానీ మంచి సినిమాల ఇస్తే ప్రేక్షకులు కచ్చితంగా గుండెల్లో పెట్టుకుంటారని నిరూపించింది రంగస్థలం. సౌత్ లో రాజమౌళి, శంకర్ సాయం లేకుండా 200 కోట్ల మార్క్ అందుకున్న మూడో సినిమాగా చరిత్ర సృష్టించింది రంగస్థలం.
ఇప్పటి వరకు కేవలం రజినీ కబాలి.. విజయ్ మెర్సల్ మాత్రమే ఈ రికార్డ్ అందుకున్నాయి. విడుదలైన నెల రోజుల తర్వాత కూడా ఈ చిత్రానికి రన్నింగ్ షేర్స్ వస్తున్నాయి. ఐదో వారంలోనూ హౌజ్ ఫుల్స్ చూపించాడు సిట్టిబాబు. ఇక ఇప్పుడు అంతా ఆశగా ఎదురుచూస్తున్న 200 కోట్ల పోస్టర్ కూడా వచ్చేసింది. బాహుబలి కాకుండా తెలుగులో 200 కోట్ల మార్క్ అందుకున్న ఒకేఒక్క హీరో రామ్ చరణ్. ఖైదీ నెం.
150 కూడా 164 కోట్ల దగ్గరే ఆగిపోయింది. ఇప్పుడు తనయుడు వచ్చి ఆ రికార్డ్ అందుకున్నాడు. ఇప్పటికీ రంగస్థలం కొన్నిచోట్ల బాగానే నడుస్తుంది. విడుదలైన ప్రతీచోట రికార్డులు సృష్టిస్తూ వెళ్తున్నాడు సిట్టిబాబు. నైజాంలో 26 కోట్ల షేర్ అందు కున్నాడు. ఇక మొన్నటి వరకు ఓవర్సీస్ లో మార్కెట్ లేని చరణ్.. ఇప్పుడు రంగస్థలంతో ఏకంగా 3.5 మిలియన్ ఖాతాలో వేసుకున్నాడు. షేర్ కూడా ఇప్పటి వరకు 120 కోట్లు వచ్చింది. మొత్తానికి 200 కోట్లతో తెలుగు ఇండస్ట్రీకి సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసాడు మన సిట్టిబాబు.