తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు సిద్దిపే అసెంబ్లీ నియోజక వర్గం శాసన సభ్యుడు మరియు కాబినెట్ మినిస్టర్ అఫ్ ఇరిగేషన్ మరియు మార్కెటింగ్ & లెజిస్లేటివ్ అఫైర్స్ అఫ్ తెలంగాణ పదవుల్లో ఉన్న హరీశ్ రావు, తన ఫోన్ ని పోగొట్టుకున్నారు. జయశంకర్ జిల్లాలో గురువారం కాళేశ్వరం ప్రాజెక్టు పనులను సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రి హరీశ్ రావు పరిశీలించారు, తర్వాత కన్నెపల్లి పంప్‌హౌస్ నిర్మాణ పనులను పరిశీలించి తిరిగి వెళుతున్న సమయంలో మంత్రి హరీశ్ రావు సెల్‌ఫోన్ కనిపించలేదు. కారులో కొద్ది దూరం వెళ్లిపోయిన తర్వాత సెల్‌ఫోన్ పోయిన విషయాన్ని గమనించి, తిరిగి వెనక్కి వచ్చారు. కారు దిగి ఆయనే స్వయంగా వెతికారు. సెక్యూరిటీ సిబ్బంది, ఇతర అధికారులు వెతికినా సెల్‌ఫోన్ దొరకలేదు. ఫోనే జాగరతగా చుసుకోలేని వారు రాష్ట్రాన్ని బాగుచేస్తారా అని ప్రతిపక్షాలు గుసగుస లాడుకుంటున్నాయి.