బాలీవుడ్ లో ఇప్పుడు కొన్ని సినిమాలకు కథతో పనిలేదు.. ఆ ఫ్రాంచైజీకి ఉన్న డిమాండ్ చాలు. కథ ఉన్నా లేకపోయినా ప్రేక్షకులు చూసేస్తారు. ఈ విషయం ఇప్పటికే ప్రూవ్ అయింది కూడా. కావాలంటే చూడండి.. ధూమ్ 3లో ఏం ఉండదు.. అమీర్ ఖాన్ తప్ప. ఆయన కోసమే ఆడేసింది ఆ సినిమా. ధూమ్ 2తో పోలిస్తే పార్ట్ 3 నాసీరకంగా ఉంటుంది. కథ ఉండదు.
కానీ 500 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక క్రిష్ సిరీస్ కూడా అంతే. క్రిష్ రెండో భాగం ఉన్నట్లుగా మూడో భాగం ఉండదు కానీ ఆడేసింది. ఇప్పుడు రేస్ కూడా అంతే. రేస్ పార్ట్ 1 అదిరిపోయింది. అబ్బాస్ మస్తాన్ తెరకెక్కిం చిన ఈ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకులను కూడా థ్రిల్ చేసింది. రెండో భాగానికి అంత రెస్పాన్స్ రాలేదు కానీ సినిమా ఆడింది. ఇప్పుడు మూడో భాగం వచ్చింది.
సల్మాన్ ఉండటంతో కథను పెద్దగా పట్టించుకోలేదు దర్శకుడు రెమో డిసౌజా. దాంతో రేస్ 3కి తొలిరోజే టాక్ తేడాగా వచ్చింది. కానీ కలెక్షన్లు మాత్రం అదిరిపోతున్నాయి. తొలి మూడు రోజుల్లోనే ఈ చిత్రం 106 కోట్లు వసూలు చేసింది. తొలిరోజు 29 కోట్లు వసూలు చేస్తూ.. రెండు మూడు రోజుల్లో 38.. 39 కోట్లు తీసుకొచ్చింది. అయితే ఈ దూకుడు ఎన్ని రోజులు ఉంటుందనేది మాత్రం తెలియదు.
సల్మాన్ ఖాన్ తో పాటు అనిల్ కపూర్, బాబీ డియోల్, జాక్వలిన్ ఫెర్నాండేజ్, డైసీ షా ఇందులో నటించారు. రంజాన్ సీజన్ కావడంతో వసూళ్ల వరద పారిస్తుంది రేస్ 3. కానీ సినిమా పరంగా మాత్రం చెత్త అంటున్నారు ప్రేక్షకులు. మరి ఈ టాక్ తోనే కమర్షియల్ గా రేస్ 3 సేఫ్ అవుతుందో లేదో చూడాలిక..!