సీనియర్ ఉద్యోగుల్ని జూనియర్ పోస్ట్ లకి బదిలీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే


సీనియర్ పోస్ట్ లో సేవలు చేసిన గవర్నమెంట్ ఉద్యోగుల్ని జూనియర్గా నియామకం చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుంది.తెలంగాణ ప్రభుత్వం అత్యంత సీనియర్లుగా ఉన్న ఇద్దరు అదికారులను అతిజూనియర్ పోస్టులలోకి బదిలీ చేసింది.పశుసంవర్థక, డెయిరీ అభివృద్ధి, మత్స్యశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సురేశ్‌చందాను రాష్ట్ర ఆర్థిక కమిషన్‌ సభ్య కార్యదర్శిగా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న బీఆర్‌ మీనాను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ కార్యదర్శిగా బదిలీ చేశారు.ఈ కొత్త పోస్టులు జాయింట్ సెక్రటరీ హోదా కలిగినవారే నిర్వహిస్తుంటారు. కాని స్పెషల్ చీప్ సెక్రటరీలుగా వేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here