ఎవరు ఎలా ఎక్కడ ద్వేష బీజం వేసారో కానీ పక్క పక్కనే ఉంటూ సోదరభావంతో మెలగాల్సిన దేశాలు అయిన ఇండియా – పాకిస్థాన్ ద్వేషం తో రగిలిపోతున్నాయి. పాకిస్తాన్ జైలు లో యావజీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఇండియన్ నేవీ ఆఫీసర్ కుల్ భూషణ్ జాదవ్‌ను ఉగ్రవాదిగా ముద్రవేసి ఉరిశిక్ష వేసింది పాకిస్థాన్ కోర్ట్. అయితే ఇంటర్నేషనల్ కోర్ట్ అఫ్ జస్టిస్ ఉరిశిక్ష వేయడం పై స్టే విధించింది. కుల్ భూషణ్ జాదవ్‌ను వారి తల్లి భార్య కలవాలని కోరగా పాకిస్థాన్ ఎన్నో షరతుల మీద ఒప్పుకుంది. కలవడానికి వెళ్లిన భార్య మరియు తల్లిని నీచంగా అవమానించారు అని సుష్మ స్వరాజ్ ఈరోజు పార్లిమెంట్ లో చెప్తూ కంటతడి పెట్టుకున్నారు. భారత స్త్రీ ఎంతో పవిత్రంగా భావించే సుమంగళి కి చిహ్నం అయిన బొట్టు, గాజులు, తాళి, తీసేయ్య మన్నారని. తల్లి మేడలో తాళి లేకపోవడం చూసి కులభూషణ్ నాన్న గారు ఎలా ఉన్నారు అని అడిగారని సుష్మ స్వరాజ్ పార్లమెంట్ లో చెప్పారు.