ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఇప్పుడంతా హిస్టారికల్ మూవీస్ హవా నడుస్తోంది. సౌత్, నార్త్ అని తేడా లేకుండా భారీ నిర్మాణ సంస్థ లన్నీ చారిత్రాత్మక చిత్రాల నిర్మాణంపై దృష్టి పెడుతూ.. అంతే భారీ విజయాలను అందుకుంటున్నాయి. ఇప్పుడదే కొవలో రాబొతున్న చిత్రం “సువర్ణ సుందరి”. చరిత్ర భవిష్యత్తును వెంటాడుతుందనేది ట్యాగ్ లైన్. సూర్య దర్శకత్వంలో ఎస్.టీమ్ పిక్చర్స్ బ్యానర్ పై ఎమ్.ఎల్.లక్ష్మి సువర్ణ సుందరి ని తెరకెక్కిస్తున్నారు. అలనాటి నేటి మేటి నటిమణి జయప్రద ఓ కీ రోల్ పోషిస్తుండగా, ఈ పాత్రకు ఓ ప్రత్యేకత ఉందని, గతానికి భవిష్యత్తుకు మధ్య వారధిగా జయప్రద గారి పాత్ర ఉంటుందన్నారు దర్శకుడు. ఇక పూర్ణకు కూతురుగా జయప్రద నటిస్తుండటంతో పాటు, వారిద్దరి మధ్య ఉంటే ఎమోషన్ ఈ సినిమాకు ఓ హైలెట్ గా చెప్పుకొవచ్చన్నారు. నిజ జీవితం తరహా లొనె జయప్రద గారి రోల్ ఈ చిత్రంలొనూ చాలెజింగ్ గా ఉండటంతో పాటు .. పతాక సన్నివేశాల్లొ డూప్ లేకుండా కష్టపడి, ఇష్టపడి జయప్రద గారు చేసిన స్టంట్స్ సువర్ణ సుందరి విజయంలో కీలక పాత్ర పోషిస్తాయని, ఇటీవలె వీటికి సంబంధించిన చిత్రీకరణ పూర్తయిందన్నారు దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్.
నిర్మాత ఎమ్.ఎల్.లక్ష్మి మాట్లాడుతూ..కంటెంట్ మరియు విజువల్ పరంగా సువర్ణ సుందరి ఆడియెన్స్ థ్రిల్ చెస్తుంది. బిజినెస్ క్యాలిక్యులేషన్స్ లేకుండా ఈ సినిమాకు తెరకెక్కించటం జరిగింది. ఫస్ట్ లుక్ కు వచ్చిన రెస్పాన్స్, మా టీమ్ కు మంచి ఉత్సాహాన్ని అందించింది. త్వరలొ టీజర్ ను, నవంబర్ ద్వీతియార్దం లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామన్నారు.
పూర్ణ, జయప్రద, సాక్షిచౌదరి, రామ్, ఇంద్ర, సాయికుమార్, నాగినీడు, కోట శ్రీనివాసరావు, ముక్తార్ ఖాన్, అవినాష్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరా: ఎలు మహంతి, సంగీతం: సాయి కార్తిక్, ఎడిటింగ్: పవ్రీణ్ పూడి.