సూర్య.. ఈ పేరుకు ఒకప్పుడు మంచి క్రేజ్ ఉండేది.. మార్కెట్ కూడా అదే స్థాయిలో ఉండేది.. కానీ ఇప్పుడు అంత సీన్ లేదు. సగానికి పైగా సూర్య మార్కెట్ పడిపోయింది. ఒకటి రెండు కాదు.. వరసగా ఐదు ఫ్లాపులు ఇచ్చాడు ఈ హీరో. తెలుగులో పర్లేదేమో కానీ తమిళనాట మాత్రం సూర్య సినిమాలు ఫ్లాపులు అయిపోయాయి. మొన్న విడుదలైన గ్యాంగ్ సైతం తెలుగులో ఓకే కానీ తమిళనాట మాత్రం డిజాస్టరే. ఈ చిత్రం తెలుగులో 8 కోట్లు వసూలు చేసింది. సూర్య రేంజ్ ఇది కాదు.. ఐదేళ్ల కింద సింగం 2 తో అప్పట్లోనే 12 కోట్ల షేర్ వసూలు చేసాడు సూర్య. అంటే అప్పటికీ ఇప్పటికీ ఎంత మార్కెట్ పడిపోయింది అనేది ఆయనే చూసుకోవాలి ఒక్కసారి.
అప్పుడు 12 కోట్లు ఉన్న మార్కెట్ కాస్తా ఇప్పుడు 4 కోట్లకు పడిపోయింది. బ్రదర్స్ సినిమానైతే అప్పట్లో బెల్లంకొండ ఏకంగా 14 కోట్లకు కొన్నారు. కానీ ఇప్పుడు గ్యాంగ్ సినిమాను కేవలం 4 కోట్లకు కొన్నారు. అంటే 10 కోట్ల మార్కెట్ పడిపోయింది. మరి ఇప్పుడు అమ్మిన 4 కోట్లు వచ్చాయని సంతోషించాలా.. లేదంటే ఉన్న మార్కెట్ ఇంత దారుణంగా పడిపోయిందని బాధ పడాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు సూర్య. ఇప్పుడు సెల్వ రాఘవన్ సినిమాలో నటిస్తున్నాడు సూర్య. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. మార్చ్ 5న ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల కానుంది. సాయిపల్లవి, రకుల్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. చాలా రోజుల తర్వాత స్టార్ హీరోతో సెల్వ చేస్తోన్న సినిమా ఇది. ఇద్దరి కెరీర్స్ కు ఈ చిత్రం చాలా అంటే చాలా కీలకం. మరి చూడాలిక.. ఈ సినిమా అయినా సూర్య కెరీర్ ను కాపాడుతుందో లేదో..?