సెప్టెంబ‌ర్ 7న కేరాఫ్ కంచెర‌పాలెం విడుద‌ల‌

Care-of-Kancharapalem-Release-on-Sept-7th
కేరాఫ్ కంచెర‌పాలెం సినిమా సెప్టెంబ‌ర్ 7న విడుద‌ల కానుంది. వైజాగ్ కు చేరువ‌గా ఉన్న కంచెర‌పాలెం నేప‌థ్యంలో సాగే భిన్న‌మైన ప్రేమ‌క‌థ ఇది. ఈ ఏడాది న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ కు తెలుగు నుంచి ఎంపికైన తొలి సినిమా ఇది. రానా ద‌గ్గుపాటి ఈ చిత్రాన్ని చూసి.. న‌చ్చి త‌నే విడుద‌ల చేయ‌డానికి ముందుకొచ్చాడు. ఇప్పుడు ఆయ‌న స‌మ‌ర్ప‌ణ‌లోనే విడుద‌ల కానుంది కేరాఫ్ కంచెర‌పాలెం. న్యూయార్క్ కు చెందిన కార్డియాల‌జిస్ట్ విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. స్వీక‌ర్ అగ‌స్తి ఈ చిత్రానికి సంగీతం అందించారు.
న‌టీన‌టులు:
సుబ్బారావ్, రాధాబెస్సి, కేశ‌వ క‌ర్రి, నిత్య‌శ్రీ గోరు, కార్తిక్ ర‌త్నం, విజ‌య ప్ర‌వీణ‌, మోహ‌న్ భ‌గ‌త్, ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్ త‌దిత‌రులు..
సాంకేతిక నిపుణులు:
ద‌ర్శ‌కుడు: వెంకటేశ్ మ‌హా
స‌మ‌ర్ప‌ణ‌: ద‌గ్గుపాటి రానా
నిర్మాత‌: విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి
సంగీతం: స‌్వీక‌ర్ అగ‌స్తి
సినిమాటోగ్ర‌ఫీ: ఆదిత్య జ‌వ్వాడి అండ్ వ‌రుణ్ ఛాపేక‌ర్
సౌండ్ డిజైన్: నాగార్జున తాళ్ల‌ప‌ల్లి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here