బిగ్ బాస్ తొలి సీజన్ జరిగిన తీరు.. ముగిసిన జోరు చూసిన తర్వాత రెండో సీజన్ పై కూడా అంచనాలు అదే రేంజ్ లో పెరిగాయి. కానీ ఎవరూ ఊహించని విధంగా ఈ సీజన్ లో ఎవరికీ తెలియని మొహాలన్నీ వచ్చేసాయి. అయితే ఇందులో నిజానికి చాలా మంది సెలెబ్రెటీస్ ను ఎంచుకున్నారు. కానీ వాళ్లే ఒప్పుకోలేదు. అల్లరి నరేష్ అన్నయ్య ఆర్యన్ రాజేష్ ను ఎంచుకున్నా ఎందుకో కానీ ఈ షోలో పాల్గొనడానికి ఆయన నుంచి నో అనే సమాధానమే వచ్చింది. దానికి తోడు జబర్దస్థ్ వేణు కూడా అలాగే నో చెప్పాడని సమాచారం.
ఇక శ్రీరెడ్డిని నాని పర్సనల్ గా పట్టుబట్టి మరీ షో నుంచి తీసేయించాడని ఆమె ఆరోపిస్తుంది. వాళ్లకు తోడు ఛార్మి సైతం బిగ్ బాస్ 2లో ఉండటానికి అనాసక్తి చూపించింది. మరో ముగ్గురు సెలెబ్రెటీస్ కూడా ఇలాగే చెప్పి తప్పించుకున్నారు. 100 రోజులు కావడం.. పైగా నాని హోస్ట్ కావడంతో ఈ సారి ఎందుకో కానీ చాలా మంది ఈ షో పై ఆసక్తి చూపించలేదు. దాంతో ఎవరు ఖాళీగా ఉన్నారా చూసుకుని మరీ అందర్నీ దించేసారు. కిరీటి దామరాజు.. కౌశల్.. రోల్ రైడా.. దీప్తి సునైన భాను శ్రీ.. ఈ బ్యాచ్ అంతా పేర్లు చెబితే కానీ గుర్తింపు లేని సెలెబ్రెటీస్. మరి వీళ్లను పెట్టుకుని నాని ఈ షోను ఎలా రన్ చేస్తాడో చూడాలిక..!