సైరా నరసింహా రెడ్డి చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ షూటింగ్ లో పాల్గొన్నారు. మెగా స్టార్ చిరంజీవితో నటించడం గౌరవమని చెప్తూ అమితాబ్ ఓ ఫోటోను ట్వీట్ చేసారు. సౌత్ క్వీన్ నయనతార కూడా ఆ చిత్రంలో ఉన్నారు. సైరా నరసింహా రెడ్డి చిత్రం తొలి స్వతంత్ర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర గా రాయబడిన రేనాటి సూర్యుడు ఆధారంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే సైరా నరసింహారెడ్డి కథ ప్రస్తుతం దేశంలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితులకు చాలా దగ్గర పోలిక ఉండటం యాదృచ్చికం.
కథ ప్రకారం బ్రిటిష్ వారు జమీందారుల ఆదీనంలో ఉన్న ఊళ్లను, వేల ఎకరాలను స్వాధీన పరుచుకొని వాటికి ప్రతిఫలంగా వారికీ భరణం చెల్లించే వారు. ఈ క్రమంలో నరసింహా రెడ్డి కి చెల్లించవలసిన భరణం ఇవ్వక పోగా, ఆయన తమ అనుచరుడిని బ్రిటిష్ వారి వద్దకు పంపి భరణం కోరగా…వారు అడుక్కునేవాడికి రాయబారి ఎందుకు అని అవమానించగా వారిపై దండయాత్ర చేస్తాడు. ఆలా నరసింహా రెడ్డి బ్రిటిష్ వారి పై తిరుగుబాటు చేసిన మొదటి యోధుడయ్యాడు. ఇదే విధంగా నేడు కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోగా రావాల్సిన నిధులను కూడా బడ్జెట్లో కేటాయించకపోవడం తో పవన్ కళ్యాణ్ కేంద్రం పై యుద్ధం ప్రకటించారు. తన స్వాభిమానం కోసం తెల్లదొరలపై పోరు నరసింహా రెడ్డి మొదలు పెడితే…ఆయన స్ఫూర్తితో దేశమంతా దశలవారీగా ప్రభల్లి స్వతంత్ర సంగ్రామంగా మారి బ్రిటిష్ వారి పతనానికి నాంది పలికింది.
ఇప్పుడు పవన్ జన సేన ఆవిర్భావ మహా సభ పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు మంత్రి నారా లోకేష్ పై అవినీతి ఆరోపణలు చేసి తెలుగు దేశం నుండి తెగ తెంపులు చేసుకుని, కేంద్ర ప్రభుత్వం పై స్పెషల్ స్టేటస్ కోసం యుద్ధం ప్రకటించగా తెదేపా వారు యన్.డి.ఏ సర్కారుకు మద్దతు ఉపసంహరించుకొని అవిశ్వాస తీర్మానం పెట్టారు. వై.ఎస్. ఆర్ సి పి ఎంపీలు ఇదే బాట పట్టక తప్పలేదు. ఇదే స్ఫూర్తిగా తమిళ్ నాడు వారు కావేరి జలాల వివాదంలో కేంద్రాన్ని నిలదీస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మమతా బనెర్జీ తో కూటమి దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టారు.
కాంగ్రెస్ మరియు వామ పక్షాలన్నీ ఏకమై కేంద్రాన్ని వివిధ అంశాలపై కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టి పార్లమెంట్ ను స్తంబింపచేశాయి. కమల్ హాసన్ పార్టీ పెట్టగ ద్రవిడ పార్టీలను ఏకంచేసి కేంద్రం పై ఒత్తిడి పెంచే పనిలో ఉన్నారు. వీటన్నిటికీ అగ్గి రాజేసింది పవన్ కళ్యాణ్ సభ అంటే అతిసేయోక్తి కాదేమో. ఆ నాడు నరసింహారెడ్డి వలె నేడు పవన్ పూరించిన శంఖారావం దేశమంతా మరో స్వాతంత్ర సంగ్రామం గా రూపుదిద్దుకుంటోంది. అయితే ఏ కాలంలోనైనా చెడుపై అంతిమ విజయం మంచిదే.