ఒకప్పుడు తెలుగులో సంచలన సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రేకు క్యాన్సర్ సోకిందనే విషయం ఇప్పుడు ఇండియన్ వైడ్ గా చర్చకు దారి తీస్తుంది. ఒంట్లో ఏదో నొప్పిగా ఉంటే ఊరికే అలా హాస్పిటల్ కు వెళ్లిన సోనాలికి కాన్సర్ అని చెప్పి బాంబ్ పేల్చారు వైద్యులు. అది కూడా ఫైనల్ స్టేజ్ కావడంతో వెంటనే న్యూయార్క్ వెళ్లిపోయింది. క్యాన్సర్ అంటే ఎన్నో రకాలు ఉంటాయి.
ఇందులో సోనాలికి ఏది వచ్చిందనేది ఇప్పుడు అందరికీ వస్తున్న అనుమానం.. దానివల్ల ఆమె ఆరోగ్యానికి ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుందనేది అభిమానులు పడుతున్న కంగారు. అయితే ఈమెకు వచ్చిన కాన్సర్ కాస్త ప్రమాదకరమైందే..! మెటెస్టిక్ కాన్సర్ తో బాధ పడుతుంది సోనాలి బింద్రే. ఒంట్లో చిన్న నొప్పితో మొదలై.. ఆ కాన్సర్ కణాలు ఆ తర్వాత రక్తంలో కలిసి బాడీ అంతా వ్యాపిస్తాయి.
అలాంటి కాన్సర్ కు సరైన కాలంలో ట్రీట్మెంట్ ఇవ్వకపోతే అది ప్రాణానికే ప్రమాదం కూడా. అయితే ఇప్పుడు సోనాలి బింద్రేకు ఉన్న ఒకే ఒక్క లక్ ఏంటంటే.. ఆమె సరైన టైమ్ లో వైద్యుల దగ్గరికి వెళ్లడం. కొన్ని నెలల పాటు న్యూయార్క్ లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకోనుంది ఈ భామ. తెలుగులో అప్పట్లో ఇంద్ర.. శంకర్ దాదా.. పల్నాటి బ్రహ్మనాయుడు.. మురారి.. ఖడ్గం లాంటి సినిమాలు చేసింది సోనాలి.