ఒక్క సినిమా చాలు.. మరిచిపోయిన హీరోను మళ్లీ గుర్తు చేయడానికి..! గతేడాది సుమంత్ విషయంలో ఇదే జరిగింది. అప్పటి వరకు అందరూ మరిచిపోయిన సుమంత్ ను మళ్లీరావా మళ్లీ గుర్తు చేసింది. ఈ చిత్రం కమర్షియల్ గా విజయం సాధించలేదు కానీ సుమంత్ అనే ఓ హీరో ఉన్నాడనే విషయం మాత్రం గుర్తు చేసింది.
గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఇప్పుడు ఈ దర్శకుడు నానితో సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే మళ్లీ రావా ఇచ్చిన స్పూర్థితో ఇప్పుడు మరో సినిమా చేస్తున్నాడు సుమంత్. ఈ చిత్రానికి ఇదం జగత్ అనే టైటిల్ కూడా పెట్టారు. ఇందులో సుమంత్ కాస్త నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది. కొత్త దర్శకుడు అనిల్ శ్రీకంఠం తెరకెక్కిస్తున్నాడు.
ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. సినిమాను ఆగస్ట్ లో ఇదం జగత్ విడుదల కానుంది. ఇప్పుడు విడుదలైన స్టిల్స్ చూస్తుంటే సినిమాపై ఆసక్తి పెరిగిపోతుంది. కచ్చితంగా ఈ సారి కూడా ఏదో కొత్త కథతోనే వస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ సినిమా ఇలా ఉండగానే తాజాగా మరో సినిమాతోనూ వచ్చేస్తున్నాడు సుమంత్.
పైగా ఇది ఆయనకు 25వ సినిమా కావడం మరో విశేషం. సంతోష్ జాగర్లపూడి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి సుబ్రమణ్యపురం టైటిల్ ఫిక్స్ చేసారు. చూస్తుంటే ఇది కార్తికేయకు కాపీలా అనిపిస్తుంది. ఈ రెండు సినిమాలతో పాటు మరిన్ని కథలు కూడా వింటున్నాడు ఈ హీరో. కమర్షియల్ హీరోగా కాకపోయినా కనీసం నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడుతున్నాడు సుమంత్. తన కెరీర్ మళ్లీ గాడిన పడుతుందని భావిస్తున్నాడు సుమంత్. మరి చూడాలిక.. ఈ అక్కినేని అల్లుడికి ఈ రెండు సినిమాలు ఎంతవరకు హెల్ప్ చేస్తాయో..?