చూస్తుంటే ఇప్పుడు సల్మాన్ పై ఏదో కుట్ర జరుగుతున్నట్లు అనిపిస్తుంది. మనిషిని చంపినపుడే నిర్దోషిగా బయటికి వచ్చాడు సల్మాన్ ఖాన్. సాక్ష్యం సరిగ్గా లేదని హిట్ అండ్ రన్ కేస్ లో ఈయన నిర్దోషిగా బయటికి వచ్చాడు. కానీ ఇప్పుడు కృష్ణజింకల కేస్ లో మనోడికి ఐదేళ్ల శిక్ష పడింది. 20 ఏళ్లుగా నానిన ఈ కేస్ ఇప్పుడు సల్మాన్ మెడకు చుట్టుకుంది.
ఈయన రెండు రోజులుగా జోద్ పూర్ జైల్లోనే ఉన్నాడు. బెయిల్ వస్తుందేమో ఈయన త్వరగానే బయటికి వస్తాడు అని ఆశిస్తున్న అభిమానులకు ఇప్పుడు షాక్ తగిలేలా ఉంది. ఎందుకంటే ఈయనకు బెయిల్ ఇవ్వాల్సిన జడ్జ్ ఇప్పుడు ట్రాన్స్ ఫర్ అయ్యాడు. పరిస్థితి చూస్తుంటే సల్మాన్ మరికొన్ని రోజులు జైలులో ఉండక తప్పేట్లు లేదు. ఎందుకంటే సల్మాన్ ఖాన్ బెయిల్ పిటిషన్ను విచారిస్తున్న డిస్ట్రిక్ అండ్ సెషన్స్ జడ్జి రవీంద్ర కుమార్ జోషీని ట్రాన్ప్ ఫర్ చేసింది రాజస్థాన్ ప్రభుత్వం.
ఉన్నట్లుండి రాజస్థాన్ లో ఒకే సారి 87 మంది జడ్జీలను ట్రాన్స్ ఫర్ చేసారు. ఇందులోనే సల్మాన్ కు శిక్ష వేసిన రవీంద్ర కుమార్ జోషీ కూడా ఉన్నారు. దాంతో ఇప్పుడు సల్మాన్ బెయిల్ పిటిషన్ పై ఇప్పుడు తేలేది కష్టంగా మారింది. కొత్త జడ్జ్ రావాలి.. ఆయన కేస్ ను పునఃపరిశీలించాలి.. అప్పుడు కానీ బెయిల్ రాదు. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మరో పది రోజులైనా సమయం పట్టేలా ఉంది. నిజానికి సల్మాన్ పెట్టుకున్న బెయిలు పిటిషన్పై ఎప్రిల్ 7న విచారణ జరగాల్సి ఉంది.
కానీ ఇప్పుడు ఉన్నట్లుండి జడ్జ్ ట్రాన్స్ ఫర్ కావడంతో సల్మాన్ బెయిలు సందిగ్ధంలో పడింది. కావాలనే ఇది చేస్తున్నారా లేదంటే అనుకోకుండా అలా జరుగుతుందా అనేది తేలాల్సి ఉంది. కానీ ఏదేమైనా ఇప్పుడు సల్మాన్ మాత్రం మరికొన్ని రోజులు ఊచలు లెక్కపెడుతూ ఉండాల్సిందే..!