ఇప్పుడు ఈ మాట అక్కడి హీరోలకు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే అక్కడి హీరోలు కేవలం సినిమాల్లోనే కాదు.. బయట కూడా అలాగే ఉంటారు. అంటే పోజులు కొడతారని కాదు.. అందరితోనూ కలిసిపోతారని.. సినిమాల్లో మాదిరే ఎవరికైనా కష్టం వస్తే ఆదుకుంటారని. ఇప్పుడు అరవ హీరోలను చూస్తుంటే వీళ్లు కదా నిజమైన హీరోలంటే అనిపిస్తుంది. వీళ్లు చేస్తున్న పనులు కూడా ఇలాగే ఉన్నాయి మరి.
ఎక్కడో పేపర్ లో ఓ రైతు కష్టం చూసి ఏ హీరో అయినా వెళ్లి 20 లక్షలు అప్పు తీరుస్తాడా..? అసలు ఆ అవసరం ఎవరికైనా ఉందా..? 5 లక్షలు ఇచ్చి పదిసార్లు పబ్లిసిటీ చేసుకుంటున్న హీరోలు ఉన్న ఈ రోజుల్లో కూడా కోటి రూపాయలు ఇచ్చి కూడా సైలెంట్ గా ఉన్నాడు సూర్య.
ఇక పేపర్ కష్టం చూసి అప్పు తీర్చిన హీరో విశాల్. ఆ తర్వాత తన అభిమన్యుడు సినిమాకు తెగిన టికెట్స్ లో ప్రతీ టికెట్ పై ఒక్క రూపాయి రైతులకు ఇచ్చి రియల్ హీరో అయ్యాడు విశాల్. అంతేకాదు.. వాళ్ల కష్టాలను ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాడు విశాల్. ఆయనకు కార్తి లాంటి హీరోలు అండగా నిలిచారు. ఈ మధ్యే రైతు కథతో చినబాబు సినిమా కూడా చేసాడు కార్తి. ఈ చిత్రం తమిళ్ లో బ్లాక్ బస్టర్.. ఈ చిత్ర విజయోత్సవ వేడుకలోనే రైతులకు కోటి విరాళాన్ని ప్రకటించాడు సూర్య. వీళ్లు మాత్రమే కాదు.. ఎక్కడ ఏ కష్టం వచ్చినా కూడా అజిత్, విజయ్ లాంటి హీరోలు కూడా వెంటనే స్పందిస్తుంటారు. మొత్తానికి వీళ్ల సేవతో హీరోలందు అరవ హీరోలు వేరయా అనిపించుకుంటున్నారు.