ఇన్నాళ్లూ తెలుగు ఇండస్ట్రీలోనే తన ప్రయాణం సాగిస్తుంది రెజీనా. ఇక్కడే నావ ముందుకెళ్లలేక.. వెనక్కి వెళ్లలేక తీరం కనబడని తీరులో చూస్తూ ఉండిపోయింది. ఇప్పుడు ఆ తీరం ముంబై వైపుగా సాగుతుంది. అక్కడ్నుంచి రెజీనాకు ఓ అవకాశం వచ్చింది. అది కూడా తెలుగులో అవకాశాలు రాని టైమ్ లో.. ఇప్పుడు కెరీర్ లో నిలబడాలంటే రెజీనా హిట్ కొట్టాల్సిందే. తెలుగులో ఇప్పుడున్న పరిస్థితులు.. అమ్మడు చేస్తున్న సినిమాలను చూస్తుంటే హిట్ కొట్టడం అనేది చాలా అంటే చాలా కష్టం. అందుకే చూపులు ముంబై వైపుగా వెళ్తున్నాయి. గతంలోనే ఓ బాలీవుడ్ సినిమాకు సైన్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఆంఖే 2లో అమితాబ్ తో పాటు నటించే అవకాశం అందుకున్నా.. అమ్మడి దురదృష్టం ఏంటో కానీ పట్టాలెక్కకుండానే సినిమా అటకెక్కేసింది. ఇప్పుడు మరో ఛాన్స్ వచ్చింది. ఈ సారి షెల్లీ చోప్రా దర్శకత్వంలో రాజ్ కుమార్ రావు, సోనమ్ కపూర్ జంటగా ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా సినిమాలో రెజీనా కూడా కీ రోల్ పోషిస్తుంది. ఈ చిత్రాన్ని విధు వినోద్ చోప్రా నిర్మిస్తుండటం విశేషం. ఈయనే మున్నాభాయ్ సిరీస్ లకు నిర్మాత. ఇప్పుడు ఈయన నిర్మాణంలోనే రెజీనా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. ఇక్కడ ఎలాగూ అమ్మాయిగారి అదృష్టం తిరగలేదు. మరి కనీసం బాలీవుడ్ లో అయినా జాతకం తిరగబడుతుందేమో చూడాలిక..!