అదేం చిత్రమో కానీ మెగా ఫ్యామిలీకి రాజకీయాలతో విడదీయరాని అనుబంధం ఏర్పడిపోతుంది. 2009 నుంచి రాష్ట్ర రాజకీయాల్లో మెగా కుటుంబం కూడా మెంబర్ అయిపోయింది. అప్పుడు ప్రజారాజ్యం వచ్చింది.. ఒక్కరు ఇద్దరు కాదు కుటుంబం అంతా ప్రచారం చేసారు. పవన్ కళ్యాణ్ అయితే సినిమాలు మానేసి అన్నయ్య కోసం తిరిగాడు.
కానీ చివరికి సీన్ రివర్స్ అయింది. అప్పుడు బన్నీ, చరణ్ కూడా ఉడతసాయం చేసారు కానీ పెద్దగా వర్కవుట్ కాలేదు. అయితే ఇప్పుడు బాబాయ్ కోసం ఏం చేయడానికి అయినా సిద్ధమే.. ఆయన అడిగేదే ఆలస్యం అంటున్నాడు మెగా వారసుడు. పైగా ఇప్పుడు చరణ్ కు ఇమేజ్ బాగానే పెరిగిపోయింది. తాజాగా ఓ కార్యక్రమానికి వచ్చిన చరణ్.. బాబాయ్ అడిగితే కచ్చితంగా ప్రచారం చేస్తానని చెప్పాడు. చెప్పకపోయినా కూడా తనవంతు సాయం చేస్తానంటున్నాడు.
ఆయన ఆదేశం కోసం వెయింటింగ్ అక్కడ అనేసాడు ఈ హీరో. ఈయన తీరు చూస్తుంటే కచ్చితంగా 2019 ఎన్నికల్లో జనసేన నుంచి రామ్ చరణ్ ప్రచారం ఊహించొచ్చు కానీ పవన్ నుంచి ఆదేశం రావడం మాత్రం అంత ఈజీ కాదు. 2014 మాదిరే ఇప్పుడు కూడా ఏ సపోర్ట్ లేకుండానే పవన్ రంగంలోకి దిగేలా కనిపిస్తున్నాడు. కుటుంబం కదిలొస్తానని చెప్పినా కూడా పవన్ మాత్రం దానికి సుముఖంగా లేడు. మరి చూడాలిక.. చివరికి ఏం జరుగుతుందో..?