సన్నీ లియోన్ తో మరో ఎన్టీఆర్ బయోపిక్ !

బాలకృష్ణ, రామ్ గోపాల్ వర్మ వేరువేరుగా ఎన్టీఆర్ బయోపిక్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే వర్మ చిత్రానికి లక్ష్మి’స్ ఎన్టీఆర్ అని పేరుపెట్టడం, చిత్రం లక్ష్మి పార్వతి కోణం లో ఉంటుందనడంతో వివాదాస్పదం అయ్యింది. బాలకృష్ణ ఎన్టీఆర్ గా నటించబోయే చిత్రానికి తేజ దర్శకత్వం వహించబోతున్నారు. కాగా తాజాగా మరో ఎన్టీఆర్ బయోపిక్ తెర మీదకొచ్చింది.

One More NTR Biopic In Row!

 

‘కామాగ్ని’ చిత్ర దర్శకుడు, తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపకుడు కేతిరెడ్డి జగదీష్‌రెడ్డి ‘లక్ష్మీస్‌ వీరగ్రంథం’ పేరుతో మరో ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో సీనియర్‌ నటి వాణీవిశ్వనాధ్‌ ను టైటిల్‌ రోల్‌ కోసం సంప్రదించారు.

 

ఆమె నటించక పోతే సన్నీలియోన్‌, లక్ష్మీరాయ్‌ వంటి హాట్ భామను తీసుకోవాలని చిత్ర నిర్మాత జి.విజయకుమార్‌గౌడ్‌ భావిస్తున్నట్లు సమాచారం.