“ఊహలు గుసగుసలాడే”, “దిక్కులు చూడకు రామయ్య”, “లక్ష్మిరావే మా ఇంటికి”, “కళ్యాణవైభోగం”,” జ్యోఅచ్చుతానంద” లాంటి విభిన్న కథాంశాలతో విజయాలు సాధించి తెలుగు ప్రేక్షకుల్లో ముఖ్యంగా ఫ్యామిలి ఆడియెన్స్‌లో ప్రత్యేక స్థానం సంపాయించాడు నాగశౌర్య. ఈ యంగ్ ఎనర్జిటిక్ హీరో వెంకి కుడుముల దర్శకత్వంలో నటిస్తున్న చిత్రానికి ఛలో అనే టైటిల్ ఖరారు చేశారు.
ఈ చిత్ర టైటిల్ ను నాగశౌర్య తల్లితండ్రులు…. నిర్మాతలు ఉషా ముల్పూరి, శంకర ప్రసాద్, దర్శకుడు వెంకి ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఐరా క్రియోషన్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ వన్ చిత్రంగా నిర్మిస్తున్నారు.
నిర్మాత ఉషా ముల్పూరి మాట్లాడుతూ…. ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్ చిత్రంగా నాగశౌర్య హీరోగా వెంకి కుడుముల దర్శకత్వంలో మేం నిర్మిస్తున్న చిత్రానికి ఛలో అనే టైటిల్ ఖరారు చేశాం. దర్శకుడు వెంకీ చెప్పిన స్టోరీ వినగానే బాగా నచ్చింది. మేం ఈ ఫీల్డ్ లోకి వస్తామనుకోలేదు. ఈ సినిమాను ప్రొడ్యూస్ చేద్దామనుకున్నప్పుడు శౌర్య కూడా షాక్ అయ్యాడు. మేం అనుకున్నదానికంటే సినిమా చాలా బాగా వచ్చింది. కెమెరామెన్ సాయి శ్రీ రామ్ గారు చాలా సపోర్ట్ ఇచ్చారు. డిఫరెంట్ లవ్ స్టోరీ, క్లైమాక్స్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ చాలా బాగుంటుంది. భవిష్యత్తులోనూ మేం మరిన్ని సినిమాలు నిర్మిస్తాం. కథలు నచ్చితే బయటి హీరోలతోనూ సినిమాలు నిర్మిస్తాం. అని అన్నారు.
దర్శకుడు వెంకి కుడుముల మాట్లాడుతూ… నేను త్రివిక్రమ్ గారి దగ్గర వర్క్ చేశానండి. శౌర్య నటుడిగా చాలా ఇష్టం. అందుకే ఆయన్ని డిఫరెంట్ గా ప్రజెంట్ గా చేస్తున్నాను. ఆంధ్రా, తమిళనాడు బార్డర్ లో జరిగే కాలేజ్ లవ్ స్టోరీ ఇది. హైదరాబాద్ నుంచి హీరో తిరుపురం వెళ్తాడు. నాగశౌర్యను నటుడిగా మరో మెట్టు ఎక్కించే సినిమా అవుతుందని నమ్ముతున్నాను. ఛలో అనే టైటిల్ పర్ ఫెక్ట్ టైటిల్. హీరోయిన్ రష్మిక మండన్న కన్నడలో సూపర్ హిట్ అయిన కిరాక్ పార్టీ ద్వారా ఫేమస్ అయ్యింది. చాలా బాగా చేసింది. నిర్మాతల సపోర్ట్ లేకపోతే ఇంత బాగా షూటింగ్ చేసే వాళ్లం కాదు. వారికి చాలా థాంక్స్. అని అన్నారు.
చిత్ర సమర్పకుడు… శంకర ప్రసాద్ ముల్పూరి మాట్లాడుతూ…. మా ప్రొడక్షన్ లో వస్తున్న మొదటి చిత్రానికి ఛలో అనే టైటిల్ ఖరారు చేశాం. నాగశౌర్య కు మంచి కమర్షియల్ హిట్ సినిమా అవుతుందని ధీమాగా చెబుతున్నాం. దర్శకుడు వెంకి కథను చాలా బాగా హ్యాండిల్ చేశారు. ప్రొడక్షన్ ను జాగ్రత్తగా చేసుకుంటే మంచి బిజినెస్ ఇది. లైట్ బాయ్ దగ్గరి నుంచి అన్ని డిపార్ట్ మెంట్స్ మాకు సపోర్ట్ చేశాయి కాబట్టే సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. డిసెంబర్ లో రిలీజ్ చేస్తాం. ఛలో టైటిల్ కూడా వేరే వాళ్ల దగ్గర ఉన్నప్పటికీ కథకు తగ్గట్టుగా ఛలో టైటిల్ ఆప్ట్ అని చెప్పగానే ఇచ్చారు. అందరికీ థాంక్స్. అని అన్నారు.
సంగీతం- సాగర్ మహతి,
సినిమాటోగ్రఫి- సాయి శ్రీరామ్,
నిర్మాత- ఉషా ముల్పూరి,
సమర్పణ – శంకర ప్రసాద్ ముల్పూరి,
దర్శకత్వం- వెంకి కుడుముల