పవన్ కళ్యాణ్ ఏమి చేసిన అది సంచలనమవుతుంది. జన సేన పార్టీ పెట్టి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పటినుండి పవర్ స్టార్ ప్రతి కదలికను ప్రత్యేక శ్రద్ధ తో వాచ్ చేస్తున్నారు ప్రజలు మరియు మీడియా. తాజాగా బల్గేరియా షూటింగ్లో ఉన్న పవన్ జీసస్ తో దిగిన ఫోటో చర్చనీయాంశమయ్యింది. ఒకానొక ఇంటర్వ్యూ లో తనకు విగ్రహారాధన మీద నమ్మకముందని చెప్పారు పవన్. అయితే ఇటీవలే జన సేన కొత్త ఆఫీస్ ఓపెనింగ్ సందర్భంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మూడు పద్ధతుల లోను ప్రార్థనలు చేయడం విశేషం. రాజకీయాలకు అనుగుణంగా పవన్ అన్ని వర్గాల వారిని దగ్గర చేసుకునే ప్రయత్నంలోనే జీసస్ తో ఫోటో దిగి ఉంటారని విశ్లేషకుల అంచనా. అయితే మరో వైపు వై ఎస్ జగన్ హిందూ మతం వైపు అడుగులు వేయటం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
ఇటీవలే ఆయన త్రిదండి చిన్న జీయర్ స్వామి పేదలకు మొక్కి ఆశీస్సులు తీసుకోగా తాజాగా పాదయాత్ర సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకొని మొక్కు కొనుట కొంతమంది క్రిస్టియన్ పాస్టర్లకు మిగుడు పడటం లేదు. తిరుపతి పాస్టర్ డేవిడ్ కరుణాకరన్ జగన్ వైఖరి పై తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా లో పెట్టిన ఓ వీడియో లో జగన్ విగ్రహారాధన చేయడంపై అసంప్త్రుపితి వ్యక్తం చేయడమే కాకుండా ఇటువంటి పనులు మనుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు కూడా. అంతటితో ఆగకుండా జగన్ తండ్రి మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజాశేఖర్ రెడ్డి రాయిని పూజించడం వల్లే అర్ధాంతరంగా చనిపోయారని వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు పాస్టర్ డేవిడ్. దీనికి జగన్ గాని హిందూ సంగాల వారు గాని ఇంకా స్పందించాల్సి ఉంది.