ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మహమ్మారి వేలాది ప్రాణాల్ని బలిగొంటున్న సంగతి తెలిసిందే. క్యాన్సర్‌పై సరైన అవాగాహన లేకపోవడం ఈ మరణాలకు కారణం. అందుకే లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ ప్రారంభించి సీనియర్ కథానాయిక గౌతమి క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ విస్త్రత ప్రచారం సాగిస్తున్న సంగతి విదితమే. నటసింహా బాలకృష్ణ, సహజనటి జయసుధ సహా పలువురు సినిమా సెలబ్రిటీల్ని కలుపుకుని ఈ ప్రచారం నిర్వహించడంలో సక్సెసయ్యారు. నేడు (నవంబర్ 12న) హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో విన్నర్ వాక్ నిర్వహించారు. క్యాన్సర్ ను జయించిన 800 మంది ఈ వాక్ లో పాల్గొనడమే గాకుండా విస్త్రతంగా ప్రచారం చేశారు. రాయల్ ఎన్ఫీల్డ్ బైకులపై క్యాన్సర్ విన్నర్స్ విన్యాసాలు… బంజారా మహిళల నృత్యాలు.. సెలబ్రిటీల హుషారైన ప్రచారార్భాటం వెరసి హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌కి ప్రత్యేక కళ వచ్చిందనే చెప్పాలి. సేమ్ టైమ్ కేన్సర్‌పై అవేర్నెస్ పెంచే లక్ష్యం నెరవేరింది.
సీనియర్ నటి గౌతమి, సహజనటి జయసుధ, డిప్యూటి స్పీకర్ పద్మ దెవెందెర్ రెడ్డి, సీనియర్ హీరో నరేష్, లైఫ్ ఎగైన్ ఫౌండెషన్ కో ఫౌండర్ హైమా రెడ్డి, దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, హీరో సర్ధార్ పటేల్, `మా` అధ్యక్షుడు శివాజీ రాజా, హీరోయిన్ మనాలీ రాధోడ్, నిర్మాత, సంతోషం అధినేత సురేష్ కొండేటి, మా అసొసియేషన్ సభ్యులంతా ఈ వాక్‌లో పాల్గొన్నారు. ఉదయం 6:30 కు జలవిహార్ వద్ద ప్రారంభమై 8:30కు పీపుల్ ప్లాజా వద్ద వాక్ ముగించారు. ఇక నెక్లెస్‌రోడ్ సెలబ్రిటీ వాక్‌లో టాలీవుడ్ ఐటెమ్ భామ ముమైత్ ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.