కాపులను బీసీల్లో కలపమని ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని ఉదృతం చెయ్యాలని చూస్తున్న విషయం తెలిసిందే. సంభందిత జి.ఓ. ప్రవేశ పెట్టడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ముద్రగడ డిసెంబర్ 6 ను డెడ్లైన్ గా ప్రకటించారు. కాగా గురువారం నాడు ముద్రగడ ముఖ్యమంత్రి కి మరో లేఖ రాసారు, కాకినాడ మునిసిపల్ ఎన్నికల సమయంలో ఆయన కాపు రిజర్వేషన్ మీద హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు.
అంబెడ్కర్ వర్ధనతి దీనమైన డిసెంబర్ 6 న తీపి కబురు వినేందుకు తమ కాపు కులస్థులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. అయితే గడువు దగ్గర పడుతున్నా ప్రభుత్వం ఈ విషయమై ఒక అడుగు వేయకపోవడం గమనార్హం. ముద్రగడ హెచ్చరికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద సీరియస్ గా తీసుకున్నట్లు కనపడట్లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతే కాకుండా, ముద్రగడ
ఉద్యమాన్ని తీవ్రతరం చేయకుండా కఠిన చర్యలు తీసుకోమని పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మరో వైపు టీడీపీ నేతలను కాపు లను బుజ్జగించే పని అప్పచెప్పారని సమాచారం.