నాగ చైతన్య అక్కినేని , దర్శకుడు మారుతి ల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ ప్రొడక్షన్ నంబర్ 3 ఈ రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియో లో ప్రారంభం అయింది. నాగ చైతన్య అక్కినేని సరసన ‘అను ఇమ్మాన్యు యేల్’ నాయికగా నటిస్తున్నారు. ఈరోజు మంచిరోజు కావటం తో ఈ చిత్రం పూజ కార్య క్రమాలు నిర్వహించటం జరిగింది. జనవరి 5 నుంచి చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని ఈ చిత్రానికి సంభందించిన ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. దర్శకుడు మారుతి.