భాగ్యనగరం మెడలో మెట్రో మణిహారం అందంగా కొలువుతీరింది. ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా హైదరాబాద్ మెట్రో ప్రారంభమైంది. మియాపూర్లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో భాగ్యనగరి మెట్రో రైలు సర్వీసులను ప్రధాని మోదీ ఆరంభించిన విషయం తెలిసిందే. మొదట మెట్రో పైలాన్ ఆవిష్కరించిన ఆయన తర్వాత మియా పూర్ మెట్రో స్టేషన్ను ప్రారంభించారు. అనంతరం మన హైదరాబాద్-మన మెట్రోపై తయారు చేసిన ప్రత్యేక వీడియోను తిలకించారు. ఆ తర్వాత మెట్రో బ్రోచర్తో పాటు మెట్రో యాప్‌ను విడుదల చేశారు.
మియాపూర్-అమీరీ్పేట-నాగోల్ మధ్య మెట్రో సర్వీసులకు ఆయన శ్రీకారం చుట్టారు. అనంతరం మియాపూర్ నుంచి కూకట్పల్లి వరకూ మెట్రో రైలులో ప్రధాని మోదీతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్, పలువురు మంత్రులు ప్రయాణించారు. అలాగే అదే రైలులో మరలా మియాపూర్కు తిరుగు ప్రయాణం అయ్యారు.
అంతకు ముందు ప్రధాని మియాపూర్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెట్రో లైన్ పైలాన్ను ప్రధాని ఆవిష్కరించారు. ఆ తర్వాత మియాపూర్ మెట్రో స్టేషన్ను ప్రారంభించి, మెట్రో రైలు ప్రాజెక్ట్ వీడియో ప్రదర్శనను తిలకించారు. అలాగే మెట్రో రైల్ బ్రోచర్తో పాటు యాప్ను విడుదల చేశారు. ముందుగా ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన కొద్దిసేపు పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత ప్రత్యేక హెలికాప్టర్లో మియాపూర్కు బయల్దేరి వెళ్లారు. ఆయన వెంట బీజేపీ నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి ఉన్నారు.
ప్రధాని ప్రయాణించిన మెట్రోకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ మెట్రో రైలును ఓ మహిళా పైలట్ నడపడం విశేషం. హైదరాబాద్ లో మొదలైన మొదటి “మెట్రో రైలు” నడిపిన మహిళా డ్రైవర్లు వీరే…కే సింధూజ (వరంగల్), బి వెన్నెల (మహబూబ్ నగర్), ఎస్ సుప్రియ (నిజామాబాద్)