శ్రీ నక్క యాదగిరి స్వామి ఆశీస్సులతో స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సుమంత్ హీరోగా, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్ర దారులుగా గౌతమ్ తిన్న సూరి దర్శకత్వంలోరాహుల్ నక్క నిర్మించిన రొమాంటిక్ డ్రామా ‘మళ్లీ రావా’ ఈ చిత్రం ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ 8న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రానికి ‘క్లీన్ యు’ సర్టిఫికెట్ వచ్చిన తరుణంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు..
ఈ సందర్భంగా మధురా శ్రీధర్ మాట్లాడుతూ మళ్లీ రావా ఓ బ్యూటీఫుల్ మ్యూజికల్ లవ్ స్టోరీ.. మా మధురా మ్యూజిక్ ద్వారా ఆడియో ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ‘ప్రేమ ఇష్క్ కాదల్’. చిత్రానికి సంగీతం అందించిన శ్రవణ్ మళ్లీ రావా కు కూడా అందించారు.. పెళ్లి చూపులు సినిమా తరువాత సరికొత్త కథలు తెలుగులో రావడం అభినందించే విషయం… 3 స్టేజ్ లో లవ్ స్టొరీ ను రాసుకున్నాడు డైరెక్టర్. ఈ సినిమా సుమంత్ కు కంబ్యాక్ అవుతుందని ఖచ్చితంగా చెప్పగలను.. ఈ స్క్రిప్ట్ ను సెలెక్ట్ చేసుకునే విషయంలో నే తెలిసింది ప్రొడ్యూసర్ కు ఉన్న టేస్ట్… అని చెప్పారు.
డైరెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ శ్రవణ్ అందించిన మ్యూజిక్ ఈ చిత్రానికి సోల్ అవుతుంది, ఇటీవలే మ్యూజిక్ ను వైజాగ్ లో విడుదల చేయడం జరిగింది.. మంచి రెస్పాన్స్ కూడా వచ్చిందని అన్నారు. నిర్మాత రాహుల్ యాదవ్ మాట్లాడుతూ ఈ సినిమా స్క్రిప్ట్ ఎంత బాగుంటుందో మ్యూజిక్ కూడా అంతే అద్భుతంగా ఉంది. ఈ చిత్రానికి ‘క్లీన్ యూ’ సెన్సార్ సర్టిఫికెట్ రావడం ఆనందంగా ఉంది. సెస్సార్ వారు ఈ సినిమా చూసి అప్రిషియేట్ చేశారు.. ముఖ్య విషయం ఏంటంటే ఈ 30న మళ్లీ రావా ట్రైలర్ ను నాగ చైతన్య -సమంతలు కలసి ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నారు.. సినిమా డిసెంబర్ 8న విడుదల కానుందని చెప్పారు.
సుమంత్, ఆకాక్ష, సింగ్, అన్నపూర్ణ, కాదంబరి కిరణ్, మిర్చి కిరణ్, కార్తిక్ అడుసుమల్లి, మాస్టర్ సాత్విక్, బేబీ ప్రీతి ఆస్రాని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డీఓపీ: సతీష్ ముత్యాల, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, ఎడిటింగ్: సత్య గిడుతూరి, లిరిక్స్: కృష్ణ కాంత్, నిర్మాత: రాహుల్ యాదవ్ నక్క, కథ-మాటలు-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: గౌతమ్ తిన్న సూరి.