పవన్ కళ్యాణ్ నేడు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. డ్రెడ్జ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న ఉద్యోగులకు మద్దతు తెలిపే సభలో పాల్గొన్న పవర్ స్టార్ చాల ఆవేశంగా ప్రసంగించారు. సి ఎం పవన్ కళ్యాణ్ అని నినదించిన అభిమానులను ఉద్దేశించి అందరు చేసే తప్పు మనం చేయకూడదని చెప్పారు. వై ఎస్ జగన్ ను విమర్శిస్తూ, తండ్రి చనిపోగానే ముఖ్యమంత్రి కావాలనుకోవదేమింటో తనకు అర్ధం కాలేదని చెప్పారు, లక్షల కోట్లు అవినీతి సొమ్ము వెనకేసుకున్న వ్యక్తి సి ఎం అయితే రాష్ట్ర గతి ఏమవుతుందో అని ఆవేదన వ్యక్తపరిచారు.
సి.ఎం. అని పిలిపించుకొని మురిసిపోయే తత్త్వం తనది కాదని, పది ఏళ్ళనుండి రాజకీయాలలో ఉన్నానని , ఎం.ఎల్.ఏ, ఎం.పి కావాలనుకొంటే తనని ఎవరు ఆపలేరని. అయితే ప్రభుత్వం లో పదవులు చేపట్టడానికి అనుభవం కావాలని చెప్పారు పవన్. ప్రధాని నరేంద్ర మోదీ పై నిప్పులు చెరిగారు జన సేన అధినేత. నిరంకుశత్వ ధోరణి లో ప్రజా వ్యతిరేక మరియు విభజన రాజకీయాలు చేస్తే పతనం తప్పదని హెచ్చరించారు.
అంతే కాకుండా ప్రజా రాజ్యం లో కోవర్ట్ లు గా చేరి పార్టీని ఎలా నాశనం చేసారో గుర్తుచేసుకున్నారు పవన్. చిరంజీవి గారిని రాజకీయంగా తొక్కేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టను అని వార్నింగ్ ఇచ్చారు.
ప్రజాసేవ చేయాలనే తపన ఉన్న చిరంజీవి లాంటి మహా వ్యక్తిని కూడా కొందరు లబ్ధికోసం బలిపెట్టారు, పీఆర్పీని దెబ్బతీసిన స్వార్థ శక్తుల్ని ఏ ఒక్కరినీ నేను మర్చిపోలేదు, అని శబదం చేసారు.