అందం, అభినయం వున్న నటి కారుణ్య. సినిమా హీరోయిన్ కావాలనే తన కలను సాకారం చేసుకుని ‘సీత.. రామునికోసం’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. తన్మయ్ చిన్మయ ప్రొడక్షన్స్ రోల్ కెమెరా యాక్షన్ బేనర్స్‌పై ఇబాక్స్ తెలుగు టీ.వి. సమర్పణలో అనిల్ గోపిరెడ్డి దర్శకుడిగా శిల్ప శ్రీరంగం, సరిత గోపిరెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘సీత.. రామునికోసం’. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్‌ని పొందింది. డిసెంబర్ 15న అత్యధిక స్క్రీన్స్‌లో రిలీజ్ అవుతుందీ చిత్రం. ఈ సందర్భంగా కారుణ్య చౌదరితో స్పెషల్ ఇంటర్వ్యూ.
మీ నేపథ్యం గురించి చెప్పండి?
– మాది కాకినాడ. డిగ్రీ కంప్లీట్ చేశాను. సినిమా హీరోయిన్ కావాలనేది నా కల. అందుకే హైదరాబాద్ వచ్చి హీరోయిన్‌గా ట్రై చేశాను.
ఈ సినిమాలో ఆఫర్ ఎలా వచ్చింది?
– అనిల్ గోపిరెడ్డిగారు హీరోయిన్స్ కోసం సెర్చ్ చేస్తున్నారని రామిరెడ్డి నన్ను రికమండ్ చేశారు. ఫొటోషూట్ చేసి సీత క్యారెక్టర్‌కి నువ్ కరెక్ట్‌గా సరిపోతావ్ అని చెప్పి నన్ను సెలెక్ట్ చేశారు. కథ వింటున్నప్పుడే నేను ఆ క్యారెక్టర్‌లో ఇన్‌వాల్వ్ అయి విన్నాను. అప్పుడు నా కళ్లలో ఎక్స్‌ప్రెషన్స్, ఫేస్ మూమెంట్స్ డైరెక్టర్‌గారికి బాగా నచ్చాయి.
ఈ చిత్రంలో మీ క్యారెక్టర్ ఎలా వుంటుంది?
– ‘సీత.. రామునికోసం’ చిత్రంలో సీత టైటిల్ క్యారెక్టర్ చేశాను. ఒక బాపు బొమ్మలా ఆ క్యారెక్టర్ వుంటుంది. ఈ క్యారెక్టర్‌తో ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతాననే నమ్మకం వుంది. ఒక తెలుగు అమ్మాయిగా సీత రోల్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ చిత్రంతో అందరికీ గుర్తుండిపోతాను. నేనెంతో ఇష్టపడి మనసు పెట్టి చేసిన సినిమా ఇది.
డైరెక్టర్ అనిల్ గోపిరెడ్డి గురించి?
– అనిల్‌గారు చాలా ఇష్టంతో ఈ కథని రెండు సంవత్సరాలు కష్టపడి తయారు చేసుకున్నారు. సీత క్యారెక్టర్‌ని స్పెషల్‌గా డిజైన్ చేశారు. అలాగే సినిమాని అనుకున్నదానికంటే అద్భుతంగా తీశారు. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్ అందరికీ ఈ చిత్రం మంచి బ్రేక్ తీసుకొస్తుంది.
సినిమా మెయిన్ కాన్సెప్ట్ ఏంటి?
– ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ సబ్జెక్ట్. నిశ్శబ్దం అంటే ఇష్టం. నీ శబ్ధం అంటే ఇంకా ఇష్టం అనే డైలాగ్‌లో సీత రోల్ తెలుస్తుంది. సీత రాముని కోసం ఏం చేసింది? తన ప్రేమ కోసం ఎంతవరకు వెయిట్ చేసింది అనేది కాన్సెప్ట్.
టీజర్‌కి, ట్రైలర్‌కి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది?
– సోషల్ మీడియాలో మేము ఎక్స్‌పెక్ట్ చెయ్యని లైక్స్ వచ్చాయి. అలాగే బయట కూడా సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అన్నంత క్యూరియాసిటీ నెలకొని వుంది. పోస్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా వున్నాయి.. అని చాలామంది చెపుతున్నారు. లాలి సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ సినిమా మీకు ఎలాంటి పేరు తెస్తుందనుకుంటున్నారు?
– ఈ సినిమా తర్వాత సీత కారుణ్య అని గుర్తు పెట్టుకుంటారు. చాలామంది అందరూ ఇప్పటికే సీత సీత అని పిలుస్తున్నారు. అంతలా కనెక్ట్ అవుతుంది. ఈ మూవీ చూసిన వారందరూ సౌందర్యగారిలా వున్నారు.. అని కాంప్లిమెంట్ ఇచ్చారు. కానీ అది నేను కాంప్లిమెంట్ కన్నా వార్నింగ్‌గా తీసుకుంటున్నాను. సౌందర్యగారు చాలా గ్రేట్ యాక్టర్. ఆమె దాంట్లో నేను ఒన్ పర్సెంట్ చేసినా సక్సెస్ అయినట్లే అని భావిస్తున్నాను.
మ్యూజిక్ పరంగా ఈ సినిమా ఎలా వుంటుంది?
– ఈ చిత్రంలో మొత్తం ఐదు పాటలు వున్నాయి. లాలి లాలి పాటని అనిల్‌గారు రాశారు. అందరూ బిగ్ సింగర్స్ పాడారు. సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మ్యూజికల్‌గా ఈ చిత్రం బిగ్ సక్సెస్ అవుతుంది. ముఖ్యంగా ఈ చిత్రానికి రీరికార్డింగ్ చాలా ఇంపార్టెంట్ డైరెక్టర్ అనిల్ గోపిరెడ్డిగారే. ఈ చిత్రానికి మ్యూజిక్ చేశారు. రీరికార్డింగ్ ఒళ్లు గగుర్పొడిచే విధంగా వుంటుంది. ఆడియన్స్ ఈ సినిమా చూసి గుడ్ ఫీలింగ్‌తో బయటికొస్తారు. ఒక ఫ్యామిలీ ఎమోషనల్ స్టోరీని బేస్ చేసుకుని డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా చేశారు డైరెక్టర్ అనిల్.
హీరో శరత్ క్యారెక్టర్ గురించి?
– శరత్‌కి ఇది ఫస్ట్ మూవీ అయినా అలా చేయలేదు. చాలా ఎక్స్‌పీరియన్స్ వున్న హీరోలా చేశారు. డైరెక్టర్ అనిల్‌గారు చాలా కూల్‌గా తనకి ఏం కావాలో అది అందరి దగ్గర్నుండి రాబట్టుకున్నారు. ఈ చిత్రంలో ఆయన సీత లవర్ క్యారెక్టర్‌లో నటించారు. హీరోగా ఆయనకి చాలా మంచి పేరు వస్తుంది. అలాగే ఈ చిత్రంలో బేబి శాన్వి ఫెంటాస్టిక్‌గా చేసింది. చాలా ముఖ్యమైన పాత్ర ఇది.