ఒక్క మంచి పని చేయాలి అని ముందుకు వచ్చిన వ్యక్తికి ఇంతమంది అడ్డు వస్తారు అని విశాల్ కి బాగా అర్ధమైంది. విశాల్ తమిళనాడు ఆర్కే నగర్ ఉప ఎన్నికకు విశాల్ దాఖలు చేసిన నామినేషన్‌ను తిరస్కరించడం…తర్వాత ఆమోదించడం…మళ్ళి తిరస్కరించడం.. ఆ తర్వాత జరిగిన హైడ్రామాపై వివరిస్తూ విశాల్ తన నామినేషన్ తిరస్కరణ విషయంలో ఇన్ని ట్విస్టులు ఉంటాయని ఊహించలేదని, తన నామినేషన్ చెల్లకపోవడంలో కుట్ర రాజకీయం దాగి ఉందని అన్నారు. ఎన్నికల అధికారి తన నామినేషన్‌ను స్వీకరించినట్లు చెప్పిన విషయంపై వీడియో ఆధారం తనవద్ద ఉందన్నారు. ప్రజలకు మంచి చేయాలని భావిస్తే ఇన్ని సమస్యలు వస్తాయని అనుకోలేదని, సినిమాలోని సన్నివేశాల తరహాలో ప్రతి నిమిషానికి ట్విస్టులు వచ్చాయని విశాల్ చెప్పారు. ప్రజలకు మంచి చేయాలనుకొనేవారికి ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరమని, ప్రజాస్వామ్య దేశంలో స్వతంత్ర అభ్యర్థి పోటీ చేయకూడదా అని ఆయన ప్రశ్నించారు. స్వతంత్య్ర అభ్యర్థిగా పోటిచేసే ఓ యువకుడికి తన మద్దతు తెలిపి అతడిని గెలిపిస్తానని, అతని ద్వారా ఈ ప్రజలకు మంచి చేస్తానని విశాల్ ప్రకటించారు.