మొండిఘటం అనే పదాలకు అర్థం కావాలంటే మణిరత్నం, శింబులను చూపిస్తే అర్థమైపోతుంది. లేకపోతే మరేంటి.. శింబుపై ఇప్పుడు తమిళనాట కావాల్సినంత రచ్చ జరుగుతుంది. అందుకే ఆయనతో సినిమాలు చేయడానికి కూడా ఏ నిర్మాత ముందుకు రావడం లేదు. ఇలాంటి టైమ్ లో మణిరత్నం ఈ హీరోతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇదే ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. శింబు వల్ల తాను 20 కోట్లు నష్టపోయానంటూ ఈ మధ్యే ట్రిపుల్ ఏ నిర్మాత మైఖెల్ రాయప్పన్ మీడియా ముందుకు వచ్చి మరీ ఆడేసుకున్నాడు. నిర్మాతల మండలి కూడా శింబు ఇష్యూని సీరియస్ గా తీసుకుంది. ఇకపై ఎవరూ తమ సినిమాల్లో శింబును తీసుకోకూడదంటూ గోల చేస్తుంది.
ఇలాంటి టైమ్ లో మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న మల్టీస్టారర్ చిత్రంలో శింబును తీసుకున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి శింబును తప్పించాలంటూ మణిరత్నంపై ఒత్తిడి పెరుగుతుంది. కానీ మణిరత్నం మాత్రం కుదరదంటున్నాడు. మరోవైపు శింబు కూడా ఈ ఇష్యూని ఇంకా సీరియస్ చేస్తున్నాడే కానీ తగ్గించడం లేదు. తాను మణిరత్నం సినిమాలోనే కాదు.. మరో రెండు సినిమాలు కూడా ఒప్పుకున్నానని.. ఎవరి కైనా దమ్ముంటే తనను వాటిలో నటించకుండా ఆపుకోండంటూ సవాల్ విసిరాడు. ఒప్పుకున్న సినిమాలన్నీ 2018లోనే పూర్తి చేసి విడుదల చేస్తా నంటూ తేల్చేసాడు శింబు. తనకు వ్యతిరేకంగా కొందరు తమిళ్ ఇండస్ట్రీలో కుట్ర పన్నుతున్నారని.. తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన వివాదాన్ని ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసని.. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పాడు శింబు. మొత్తానికి ఇప్పుడు ఇటు మణిరత్నం.. అటు శింబు ఇద్దరూ ఇద్దరే అనిపించుకుంటున్నారు. ఇగోను జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు.