మెట్రో వచ్చింది అని సంతోషపడాలా లేక బాధ పడాలా హైదరాబాద్ వాసులకి అర్ధం కావట్లేదు. మెట్రో వచ్చి ట్రాఫిక్ కష్టాలతో పాటు సమయం కాపాడుతుంది అని ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలకి వాటినుంచి విముక్తి దొరికినట్టు లేదు. ట్రైన్ స్పీడ్ చూస్తే దాన్ని మెట్రో అనడం హాస్యాస్పదంగా ఉంటుంది, స్పీడ్ పెరిగే లోపే స్టేషన్ రావడం, ఫ్రీక్వెన్సీ లేకపోవడం వళ్ళ స్టేషన్ లోనే అరగంటకు పైగా వెయిట్ చేయాల్సి వస్తుంది. ట్రాఫిక్ లో వెళ్లినా అంతే సమయం పడుతుంది అని ప్రయాణికులు వాపోతున్నారు. దీనికి తోడు మెట్రో చార్జీ ల మోత మోగిపోతుంది, మెట్రోకీ కూడా బస్సు తరహాలో పాస్ లాంటి సౌకర్యం పెడితే బాగుంటుందని ,అలా ఆయినా మెట్రో కి జన సంచారాం పెరుగుతుంది అని ప్రజలు భావిస్తున్నారు . ఇంకా సైకిల్ ల విషయానికి వస్తే కొన్ని స్టేషన్స్ వరకే వాటిని పరిమితం చేశారు అని తెలుస్తుంది.